Prasanth Varma: నాకు కన్నీళ్లు ఆగడంలేదు.. చిరు మాటలకి ఎమోషనలైన హనుమాన్ డైరెక్టర్

Prasanth Varma: నాకు కన్నీళ్లు ఆగడంలేదు.. చిరు మాటలకి ఎమోషనలైన హనుమాన్ డైరెక్టర్

హనుమాన్(HanuMan) మూవీ దర్శకుడు తన సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) తన హనుమాన్ సినిమా గురించి మాట్లాడటం తనకి సంతోషాన్ని కలిగించిందని, ఆ మాటలకి తనకు కన్నీళ్లు ఆగడంలేదని ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సౌత్ ఇండియా ఫెస్టివల్-2024 కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. తాను చాలా కాలంగా హనుమాన్ కాన్సెప్ట్ తో సినిమా చేయాలనుకున్నానని, కానీ, కుదరలేదు అని, ఇన్నాళ్ల నా కలను హనుమాన్ రూపంలో తేజ సజ్జ తీర్చాడని చెప్పుకొచ్చాడు. 

ఆ వీడియో చూసిన హనుమాన్ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎమోషనల్ అయ్యారు.. నేను నటించాలనుకున్న కలల చిత్రం హనుమాన్.. అనే మాటలు పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి నోటి నుండి విన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ మాటలు నాపై మరింత బాధ్యతను పెంచాయి. మైటీ మెగాస్టార్ నోటి నుండి వచ్చిన ఈ మాటలను నేను ఎప్పటికీ గౌరవిస్తాను. ఈ వీడియో చూస్తుంటే.. నాకు  కన్నీళ్లు ఆగడంలేదు. కానీ, అక్కడే ఉన్న తేజ సజ్జ ఫీలింగ్ ఏంటో నేను ఊహించగలను.. అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం ఆయన చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.