లెక్చరర్ వేధించాడని.. మణికొండలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య 

లెక్చరర్ వేధించాడని.. మణికొండలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య 

హైదరాబాద్: గ్రేటర్​సైబరాబాద్​ పరిధిలోని మణికొండలో బీటెక్​ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగుచూసింది. మణికొండ పరిధిలోని పుప్పాల గూడకు చెందిన శ్రేయ(20) సోమవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.  ఘటనస్థలంలో శ్రేయ రాసినట్లు గా భావిస్తున్న నోట్​ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన బలవన్మరణానికి విద్యార్థులు, ఫ్యాకల్టీ కారణమని సూసైడ్​ నోట్​ లో రాయడం కలకలం రేపుతోంది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  శ్రేయ స్థానిక వాసవి ఇంజనీరింగ్​ కాలేజీ బీటెక్​ రెండో సంవత్సరం చదువుతోంది.అయితే గత కొంత కాలంగా ఫ్యాకల్టీ, విద్యార్థులను వేధింపులకు గురైనట్లు తెలుస్తోంది. ఎగ్జామ్​ సమయంలో  ఓ లెక్చరర్ అందరి ముందు తనను అవమానించడం, తోటి విద్యార్థులు టార్గెట్​ చేసి వేధించడంతో  మనస్తాపం చెందినట్లు  శ్రేయ సూసైడ్​ నోట్​రాసిందని పోలీసులు చెబుతున్నారు. 

సూసైడ్ నోట్‌తో పాటు ఇతర ఆధారాలను సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.పూ ర్తి విచారణ అనంతరం బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని నార్సింగి పోలీసులు తెలిపారు.