
- వ్యక్తిని చితకబాది చేసి పోలీసులకు అప్పగింత
జీడిమెట్ల, వెలుగు : వాట్సాప్‌లో అశ్లీల ఫొటోలు పోస్ట్ చేస్తూ మహిళలను వేధిస్తున్న వ్యక్తికి దేహశుద్ధిచేసిన ఘటన సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మెదక్‌కు చెందిన సికిందర్అలియాస్ నాని(26), తూంకుంటలో మెడికల్ ల్యాబ్ నిర్వహిస్తున్నాడు. ల్యాబ్‌కు టెస్ట్ ల కోసం వచ్చే మహిళలకు తిరిగి రిపోర్టులు పంపేందుకు ఫోన్ నంబర్లు తీసుకున్నాడు.
దీంతో కొందరు మహిళలకు అశ్లీల మేసేజ్‌లు వాట్సాప్ ద్వారా పంపిస్తూ వేధిస్తున్నాడు. మంగళవారం సూరారం కాలనీకి వచ్చి ఓ మహిళతో ఫోన్లో అసభ్యంగా మాట్లాడాడు. దీంతో ఆమె బంధువులకు చెప్పగా వారు వచ్చి అతడిని పట్టుకుని చితకబాదారు. అనంతరం సూరారం పోలీసులకు అప్పగించారు.