ఆడపిల్లలు పుట్టారని అత్తింటి వేధింపులు

ఆడపిల్లలు పుట్టారని అత్తింటి వేధింపులు

ఆడపిల్లలు పుట్టారని భార్యగా.. ఒప్పుకునేది లేదంటూ తీవ్ర వేధింపులకు గురి చేస్తున్న భర్త అత్తింటివారి వేధింపుల నుంచి రక్షించాలంటూ ఓ మహిళ  ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఇవాళ(సోమవారం) హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో తల్లిదండ్రులు నరసయ్య, గంగామణి లతో కలిసి బాధితురాలు లావణ్య  ఆవేదనను వ్యక్తం చేశారు.

తూప్రాన్ పట్టణానికి చెందిన సంతోష్ తో హైదరాబాద్ జగద్గిరిగుట్టకు చెందిన లావణ్యకు 2016 ఆగస్టు 26 న పెళ్లి జరిగింది. మ్యారేజ్ సమయంలో పది లక్షల కట్నం, బంగారము ఇతర సామాగ్రి ఇచ్చారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగమంటూ తమను మోసం చేశారని తెలిపారు లావణ్య. పాప జన్మించడంతో అదనపు కట్నం తీసుకురావాలని తీవ్రంగా వేధించే వారన్నారు. దీంతో తన తల్లిదండ్రులు మరో ఐదు లక్షలు ఇచ్చినట్టు తెలిపారు. తిరిగి రెండోసారి కూడా పాప పుట్టడంతో మరో 15 లక్షలు తీసుకువస్తేనే ఇంట్లోకి రాను ఇస్తామంటూ వేధింపులు ప్రారంభించారని ఆవేదన్ వ్యక్తం చేశారు లావణ్య. భర్తతో పాటు ఆయన తల్లిదండ్రులు మరిది తనను మానసికంగా వేదింపులకు గురి చేస్తున్నారంటూ జగద్గిరిగుట్ట పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసిన పోలీసులు పెద్దగా స్పందించలేదని తెలిపారు. ప్రస్తుతం మరో అమ్మాయిని వివాహం చేసుకుని… నీ బతుకు నువ్వే బతుకు అంటూ ఫోన్లలో వేధింపులకు గురిచేస్తున్నారంటూ తెలిపారు.

బాధితులకు తగిన న్యాయం చేయాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య  వ్యవస్థాపకురాలు విమలక్క  డిమాండ్ చేశారు. ఆడపిల్లలు పుట్టారని భార్యను కాదని .. మరో ఆడపిల్ల ను పెళ్లి చేసుకున్న సంతోష్ కుటుంబం నుంచి… బాధిత మహిళలకు వారి కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.