IND vs SA: ఫిట్‌గా ఉన్నా నో రిస్క్: సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు హార్దిక్, బుమ్రా దూరం.. కారణమిదే!

IND vs SA: ఫిట్‌గా ఉన్నా నో రిస్క్: సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు హార్దిక్, బుమ్రా దూరం.. కారణమిదే!

సౌతాఫ్రికాతో జరగబోయే మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ కు టీమిండియా స్టార్ ప్లేయర్స్ హార్దిక్ పాండ్య, జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇద్దరూ ప్రస్తుతం పూర్తి ఫిట్ గా ఉన్నప్పటికీ వన్డేలకు రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. 2026 ఫిబ్రవరిలో టీ20 వరల్డ్ కప్ కు ముందు పని భారం దృష్టిలో ఉంచుకొని పాండ్య, బుమ్రాలను కేవలం టీ20 మ్యాచ్ లనే ఆడించాలనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్టు సమాచారం. వన్డేలకు దూరంగా ఉన్నా.. వచ్చే నెలలో సౌతాఫ్రికాతో జరగబోయే ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ కు వీరిద్దరూ అందుబాటులో ఉండడం గ్యారంటీ.

పాండ్య ఫిట్: 

ఆసియా కప్ లో ఫైనల్ కు ముందు మోకాలి గాయంతో ఇబ్బంది పడిన పాండ్య పాకిస్థాన్ తో జరిగిన తుది సమరానికి దూరమయ్యాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో ఆ తర్వాత జరిగిన ఆసీస్ సిరీస్ కు దూరమయ్యాడు. తాజా సమాచారం ప్రకారం ఈ టీమిండియా ఆల్ రౌండర్ పూర్తిగా కోలుకున్నట్టు తెలుస్తోంది. సర్జరీ నుంచి తప్పించుకున్న పాండ్య త్వరలోనే భారత జట్టులోకి రానున్నాడు. సౌథఫరికాతో వన్డే సిరీస్ ఆడించి టీ20 వరల్డ్ కప్ ముందు రిస్క్ చేసే ఆలోచనలో బీసీసీఐ లేనట్టు తెలుస్తోంది. దీంతో హార్దిక పాండ్య సౌతాఫ్రికాతో జరగబోయే 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో అందుబాటులో ఉంటాడు. 

బుమ్రాకు రెస్ట్:

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడిన బుమ్రా.. ప్రస్తుతం సౌతాఫ్రికాతో రెండు మ్యాచ్ ల టెస్ట్ ఆడాడు. రెండో టెస్ట్ ముగిసిన వెంటనే మూడు రోజుల గ్యాప్ లో వన్డే సిరీస్ జరగనుంది. దీంతో బుమ్రాకు రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. 2026 టీ20 వరల్డ్ కప్ ముందు బుమ్రాకు వన్డేల్లో రెస్ట్ ఇచ్చి టీ20 మ్యాచ్ లు మాత్రమే ఆడించే ఉద్దేశ్యంలో బీసీసీఐ అధికారులు ఉన్నారు. ప్రస్తుతం సౌతాఫ్రికాతో రెండో టెస్ట్ కోసం సిద్ధమవుతున్న బుమ్రా.. నవంబర్ 30న జరగబోయే వన్డే సిరీస్ లో రెస్ట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.    

►ALSO READ | ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌లో రోహిత్ చేజారిన టాప్ ర్యాంక్‌‌‌‌‌‌‌‌  

నవంబర్ 30 నుంచి వైట్ బాల్ సిరీస్: 

సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా నవంబర్ 30 న తొలి వన్డే.. డిసెంబర్ 3 న రెండో వన్డే.. డిసెంబర్ 6 న మూడో వన్డే జరుగుతుంది. తొలి మూడు వన్డేలకు వరుసగా రాంచీ, రాయ్‌పూర్,విశాఖపట్నం ఆతిధ్యమిస్తాయి. డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 19 వరకు మొత్తం 5 టీ 20 మ్యాచ్ లు జరుగుతాయి. డిసెంబర్ 9 న కటక్ వేదికగా తొలి టీ20.. డిసెంబర్ 11 న్యూ చండీగఢ్ వేదికగా రెండో టీ20.. డిసెంబర్ 14 న ధర్మశాల వేదికగా మూడో టీ20.. డిసెంబర్ 17న లక్నో వేదికగా నాలుగో టీ20.. డిసెంబర్ 19న అహ్మదాబాద్ లో ఐదో టీ20 జరుగుతాయి. వన్డే మ్యాచ్ లో మధ్యాహ్నం 1:30 నిమిషాలకు.. టీ20 మ్యాచ్ లు రాత్రి 7:00 గంటలకు ప్రారంభమవుతాయి.