ఆమెతో కలిసి హార్దిక్‌‌‌‌ బర్త్‌‌‌‌డే సెలబ్రేషన్‌‌‌‌

ఆమెతో కలిసి హార్దిక్‌‌‌‌ బర్త్‌‌‌‌డే సెలబ్రేషన్‌‌‌‌

ముంబై: టీమిండియా ఆల్‌‌‌‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఆటతో పాటు పర్సనల్ లైఫ్‌‌‌‌లోనూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాడు. శనివారం 32వ బర్త్‌‌‌‌డే సెలబ్రేషన్స్‌‌‌‌తో మరోసారి హాట్ టాపిక్‌‌‌‌గా మారాడు. భార్య నటాషా స్టాంకోవిచ్‌‌‌‌తో విడిపోయిన తర్వాత హార్దిక్ మోడల్ మహీక శర్మతో ప్రేమలో పడ్డాడు. మహీకతో దిగిన ఫొటోలను ఈ మధ్యే సోషల్‌‌‌‌ మీడియాలో  షేర్ చేసి తమ రిలేషన్‌‌‌‌షిప్‌‌‌‌ను అఫీషియల్‌‌‌‌గా అనౌన్స్ చేసిన పాండ్యా.. ఇప్పుడు ఆమెతో కలిసి తన బర్త్‌‌‌‌డేను సెలబ్రేట్ చేసుకున్నాడు. బర్త్‌‌‌‌ డేకు  ఒక రోజు ముందు ముంబై ఎయిర్‌‌‌‌పోర్టులో కనిపించిన ఈ జంట, ఆ తర్వాత ఒక ప్రైవేట్ బీచ్ వెకేషన్‌‌‌‌కు వెళ్లింది.

 ఈ సందర్భంగా క్యాండిల్‌‌‌‌ లైట్ డిన్నర్ చేసిన పాండ్యా  మహీక చేతిలో చేయి వేసి నడుస్తున్న రొమాంటిక్ ఫొటోను ఇన్‌‌‌‌స్టాలో షేర్ చేశాడు. ఈ ఫొటోకు ‘బిట్టర్ స్వీట్ సింఫనీ’ పాటను బ్యాక్‌‌‌‌గ్రౌండ్‌‌‌‌గా జోడించాడు. అదే టైమ్‌‌‌‌లో తన కుమారుడు అగస్త్యతో పాటు, తల్లి, అమ్మమ్మ సమక్షంలో కేక్ కట్ చేస్తున్న ఫొటోలను కూడా హార్దిక్ పంచుకున్నాడు. కాగా, 24 ఏండ్ల మహీక శర్మ బాలీవుడ్‌‌‌‌లో పేరున్న  మోడల్. ప్రముఖ డిజైనర్లు మనీష్ మల్హోత్రా, అనితా డోంగ్రే వంటి వారితో ఆమె పనిచేసింది.