Hardik Pandya: మోడల్‌తో హార్దిక్ పాండ్య డేటింగ్ రూమర్స్.. ఎవరీ మహైకా శర్మ..?

Hardik Pandya: మోడల్‌తో హార్దిక్ పాండ్య డేటింగ్ రూమర్స్.. ఎవరీ మహైకా శర్మ..?

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య మరోసారి డేటింగ్ చేస్తున్నట్టు వార్తల్లో నిలిచాడు. మోడల్, నటి మహికా శర్మతో ప్రేమలో ఉన్నట్టు పుకార్లు వస్తున్నాయి. మహీకా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కొన్ని ఫోటోస్ రివీల్ చేయడంతో వీరి మధ్య వస్తున్న డేటింగ్ వార్తలు వైరల్ అవుతున్నాయి. మహికా సెల్ఫీ తీసుంటూ కొన్ని ఫోట్లోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. వీటిలో ఒక ఫోటోలో హార్దిక్ పాండ్య ఉన్నట్టు అర్ధమవుతోంది. అంతేకాదు ఆమె మరొక పోస్ట్ లో హార్దిక్ జెర్సీ అతని నంబర్ 33తో కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. 

హార్దిక్ పాండ్య, మహికా శర్మ ఇంస్టాగ్రామ్ లో ఒకరినొకరు ఫాలో అవుతున్నట్టు ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఆసియా కప్ లో భాగంగా ఇండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ సందర్భంగా దుబాయ్ లో మహికా కనిపించడంతో వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నట్టు నెటిజన్స్ కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. వీరిద్దరి మధ్య వస్తున్న డేటింగ్ రూమర్స్ పై హార్దిక్.. మోడల్ మహికా ఇప్పటివరకు మాట్లాడలేదు. నటాషా స్టాంకోవిచ్ నుండి విడాకులు తీసుకొన్న తర్వాత బ్రిటిష్ గాయని జాస్మిన్ వాలియాతో హార్దిక్ రిలేషన్ లో ఉన్నాడని.. ఆ తర్వాత వారు విడిపోయారనే వార్తలు వచ్చాయి. ప్రస్తుతం మహికా ఎవరనే విషయం తెలుసుకోవాలని నెటిజన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. 

ఎవరీ మహైకా శర్మ..?

మహికా మోడలింగ్, నటి. కేవలం 24 సంవత్సరాల వయసులోనే మహీక ఇండియన్ ఫ్యాషన్, సినీ పరిశ్రమలో తనదైన స్థానాన్ని ఏర్పరచుకుంది. న్యూఢిల్లీలో పుట్టి పెరిగిన ఆమె కేవలం మోడల్, నటి మాత్రమే కాదు. సర్టిఫైడ్ యోగా ట్రైనర్ కూడా. ఆమె ప్రయాణం నేవీ చిల్డ్రన్ స్కూల్‌లో ప్రారంభమైంది. 2014 నుండి 2018 వరకు అక్కడే చదువుకుంది. తర్వాత ఆమె ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్ళింది. మేరీల్యాండ్‌లోని యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్ సైకాలజీలో డిగ్రీని సంపాదించినట్లు తెలుస్తోంది. తనిష్క్, వివో, యునిక్లో వంటి బ్రాండ్‌లతో పనిచేసింది. 2024లో ఆమె ఇండియన్ ఫ్యాషన్ అవార్డులలో 'మోడల్ ఆఫ్ ది ఇయర్ (న్యూ ఏజ్)' టైటిల్‌ను కూడా గెలుచుకుంది.

ఆసియా కప్ తో పాండ్య బిజీ:

హార్దిక్ పాండ్య ప్రస్తుతం ఆసియా కప్ 2025 ఆడుతూ బిజీగా ఉన్నాడు. టీమిండియా ఆల్ రౌండర్ గా జట్టులో తనదైన మార్క్ వేస్తున్నాడు. 
ఇప్పటివరకు బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోయినా కొత్త బంతితో బౌలింగ్ చేస్తూ రాణిస్తున్నాడు. ఈ మెగా టోర్నీ కోసం పూర్తిగా లుక్ మార్చేసిన ఈ టీమిండియా ఆల్ రౌండర్ ప్రధాన ఆకర్షణగా మారాడు. ఇండియా తరపున టెస్ట్ క్రికెట్ కు దూరంగా ఉన్న పాండ్య.. వన్డే, టీ20ల్లో ఆల్ రౌండర్ గా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @angreziedaaru