
టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు సర్జరీ సక్సెస్ ఫుల్ గా పూర్తయింది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్ లో చెప్పాడు హార్దిక్ పాండ్యా. హాస్పిటల్ బెడ్ పై చిరునవ్వుతో ఉన్న ఫొటోను కూడా హార్దిక్ పోస్ట్ చేశాడు.
వెన్ను కిందిభాగంలో నొప్పితో బాధపడిన హార్దిక్ పాండ్యా.. లండన్ లో చికిత్స తీసుకున్నాడు. గతంలో ఆసియా కప్ సమయంలోనూ వెన్నునొప్పితో ఇబ్బంది పడ్డాడు హార్దిక్. బ్రిటీష్ డాక్టర్ అప్పుడు చికిత్స అందించాడు. ఆ తర్వాత కొన్ని సిరీస్ లు ఆడాడు. అదే నొప్పి.. మళ్లీ సౌతాఫ్రికా టూర్ కు ముందు తిరగబెట్టింది. దీంతో.. మళ్లీ లండన్ కు వెళ్లి ట్రీట్ మెంట్ చేయించుకున్నాడు. సర్జరీ సక్సెస్ ఫుల్ గా పూర్తయిందని హార్దిక్ చెప్పాడు. తాను బాగుండాలని కోరుకున్న అందరికీ ధన్యవాదాలు తెలిపాడు. ఇంకొద్దిరోజులు మాత్రమే నన్ను మీరు మిస్ అవుతారంటూ తనదైన స్టైల్లో కామెంట్ పెట్టాడు.
హార్దిక్ పాండ్యా.. అతిత్వరలోనే జరగనున్న బంగ్లాదేశ్ టీట్వంటీ సిరీస్ లోనూ ఆడడటం లేదు. ఫాస్ట్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా కూడా ఇటీవలే గాయం కారణంగా టీమిండియాకు దూరం అయ్యాడు.