MI vs DC: విప్రజ్ నిగమ్ కు టెస్ట్ ఫీల్డింగ్ సెటప్ .. ప్రయోగం చేసి పరువు పోగొట్టుకున్న హార్దిక్

MI vs DC: విప్రజ్ నిగమ్ కు టెస్ట్ ఫీల్డింగ్ సెటప్ .. ప్రయోగం చేసి పరువు పోగొట్టుకున్న హార్దిక్

వాంఖడే వేదికగా బుధవారం (మే 21) ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ప్రయోగాత్మక ఫీల్డింగ్ ను సెట్ చేసింది. ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో ఈ సంఘటన జరిగింది. విల్ జాక్స్ వేసిన ఇన్నింగ్స్ 5 ఓవర్ రెండో బంతికి అభిషేక్ పోరెల్ స్టంపౌటయ్యాడు. ఈ దశలో క్రీజ్ లోకి ఆశ్చర్యకరంగా విప్రజ్ నిగమ్ బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. దీంతో హార్దిక్ పాండ్య ఢిల్లీ జట్టును మరింత ఒత్తిడిలోకి నెట్టాలని భావించి విప్రజ్ కు టెస్ట్ ఫీల్డ్ సెటప్ చేశాడు.         

షార్ట్ లెగ్, లెగ్ స్లిప్, మిడాన్ కు ముందు ఫీల్డర్లను ఉంచాడు. ముగ్గురు ఫీల్డర్లు దగ్గర్లోనే ఉంచడం విశేషం. అయితే ఆఫ్ సైడ్ ముగ్గురు ఫీల్డర్లు మాత్రమే ఉండడం గమనించిన అంపైర్ నో బాల్ ప్రకటించాడు. దీంతో విప్రజ్ ఫ్రీ హిట్ ను సిక్సర్ గా మలిచాడు. అంతేకాదు ఆ ఆతర్వాత నాలుగు, ఐదు బంతులను ఫోర్లు కొట్టాడు. ఈ ఓవర్ లో వికెట్ పడినా హార్దిక్ సెట్ చేసిన ఫీల్డింగ్ వర్కౌట్ కాలేదు. దీంతో ఈ ఓవర్ లో 16 పరుగులు వచ్చాయి. 

ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ కు మంచి ఆరంభం లభించినా.. ఆ తర్వాత ఢిల్లీ బౌలర్ల ధాటికి కుదేలయ్యారు. సూర్య కుమార్ యాదవ్ ( 43 బంతుల్లో 73: 7 ఫోర్లు, 4 సిక్సర్లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్ కు తోడు నమన్ ధీర్(8 బంతుల్లో 22: 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఢిల్లీ 108 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచింది.