దంచికొడుతున్న ఎండలు.. ట్రాఫిక్ పోలీసుల కష్టాలు

దంచికొడుతున్న ఎండలు..  ట్రాఫిక్ పోలీసుల కష్టాలు

హైదరాబాద్ : సిటిలో ఎండలు మండిపోతున్నాయి. జనాలు మధ్యాహ్నం పూట బయటకు రావాలంటేనే జంకుతున్నారు. రోడ్డ మీద పదినిమిషాలు నిలబడలేని పరిస్ధితి కనబడుతుంది. అలాంటిది ఎండలో ఉదయం నుంచి సాయంత్రం వరకు డ్యూటీ చేస్తున్న ట్రాఫిక్ పోలీసుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. మండుతున్న ఎండలో ట్రాఫిక్ పోలీసులు ఎలా డ్యూటి చేస్తున్నారు. వాళ్ళు ఎండ నుంచి ఉపశమనం పోందడానికి పోలీస్ బాసులు ఎలాంటి సదుపాయాలు కల్పించారు. మండు వేసవిలో ట్రాఫిక్ పోలీసుల కష్టాలపై స్ఫెషల్ స్టోరి.

ఈ వేసవిలో ఎండలు దంచికోడుతున్నాయి. ఎప్రిల్, మే నేలలోనే 40నుంచి 43డీగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో వేడికి జనాలు బయటి రావాలంటేనే భయపడుతున్నారు. ఎండ తీవ్రతలకు తోడు వడగాల్పులు, ఉక్కపోత ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇక వీరి పరిస్థితి ఇలా ఉంటే ట్రాఫిక్ పోలీసుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సిటిలో ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడానికి నానా తంటాలు పడుతున్నారు. ఎండలో ట్రాఫిక్ జామ్ అయినప్పుడు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పది నిమిషాలు ఎండలో ఉంటేనే మనం నీడను వెతుక్కుంటాం. ట్రాఫిక్ పోలీసులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండకు ఎండుతూ డ్యూటీలు చేస్తున్నారు.

రోజురోజుకి ఉష్టోగ్రతలు పెరుగుతుండటంతో ఎండలు మండిపోతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు ఎండ వేడిని తట్టుకుంటు ట్రాఫిక్ జంక్షన్ల దగ్గర, సిగ్నల్స్ దగ్గర ట్రాఫిక్ జామ్ కాకుండా డ్యూటిలు చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులకు పోల్యూషన్ తో పాటు తీవ్ర ఎండలో డ్యూటిలు చేయడంతో వారి ఆరోగ్యాలు తోందరగా దెబ్బతింటున్నాయి. ఎండలో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర నిలువ నీడలేని ప్రదేశాల్లో డ్యూటిలు చేస్తూ ఎండ వెడిమికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.

ట్రాఫిక్ పోలీసులకు ఉదయం 6 గంటల నుంచి.. మధ్యాహ్నం 2 రెండు గంటల వరకు 8గంటలు డ్యూటీలు చేస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10గంటల వరకు రెండు షిప్ట్ లలో డ్యూటిలు చేస్తున్నామని చెబుతున్నారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉన్నాయని.. ఎండ నుంచి తమ ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. తమ ఉన్నతాధికారులు ఎండ నుంచి ఉపశమనం కోసం సదుపాయాలు కల్పిస్తురాని చెప్పారు. 

ఉదయం, సాయంత్రం పూటనే ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతుందంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. తమ డిపార్ట్ మెంట్ ఎండ నుంచి రక్షణగా సమ్మర్ కిట్లను అందిస్తున్నారన్నారు. కళ్లకు చల్లగా ఉండేందుకు సన్ గ్లాసెస్ ను, మజ్జిగా ప్యాకేట్స్, వేసుకోవడానికి కూల్ కోట్లను, గ్లూకోజ్ ప్యాకేట్లను అధికారులు అందిస్తున్నారని తెలిపారు. వేడితో ఎంతో ఇబ్బందులున్నా డ్యూటి కోసం ఎండలు సైతం లెక్కచెయ్యమంటున్నారు పోలీసులు. ఎండలో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండా  ట్రాఫిక్ ను క్లీయర్ చేస్తామంటున్నారు. వడగాల్పులు, ఎండ వెడికి తమ ఆరోగ్యాలు క్షీణించినా ట్రాఫిక్ జామ్ కాకుండా చూస్తున్నామన్నారు. ఎండలో 10 నిమిషాలు నిలబడలేని పరిస్థితి కనబడుతుందని.. అలాంటి పరిస్థితిలో ట్రాఫిక్ ను కంట్రోల్ చేస్తున్న ట్రాఫిక్ పోలీసులకు హ్యాట్సాఫ్  చేప్పాసిందే అంటున్నారు పబ్లిక్.