
పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ మూవీ ‘హరిహర వీరమల్లు’. దర్శకుడు క్రిష్ కొంత భాగాన్ని తెరకెక్కించగా, జ్యోతి కృష్ణ బ్యాలెన్స్ షూట్‌ను చిత్రీకరించాడు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం సమర్పణలో ఎ దయాకర్ రావు నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ‘హరిహర వీరమల్లు : స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో విడుదల కానుంది. భారీ అంచనాల మధ్య రూపొందుతోన్న ఈ సినిమా విడుదలను ఇప్పటికే పలుసార్లు వాయిదా వేశారు. రీసెంట్‌గా షూటింగ్ కంప్లీట్ అవడంతో శుక్రవారం ఫైనల్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్.
జూన్ 12న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ‘జీవితకాలపు యుద్ధానికి సిద్ధంగా ఉండండి.. ఈ డేట్‌ను మీ క్యాలెండర్‌లో మార్క్ చేసుకోండి’ అంటూ మూవీ టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అలాగే ‘ధర్మ యుద్ధం ప్రారంభమవుతుంది’ అంటూ రిలీజ్ చేసిన పోస్టర్‌లో చారిత్రాత్మక యోధుడు వీరమల్లుగా పవన్ కళ్యాణ్ కనిపించిన తీరు సినిమాపై ఆసక్తిని పెంచింది.
ఇందులో మొఘల్ చక్రవర్తిగా బాబీ డియోల్ కనిపించనున్నాడు. నిధి అగర్వాల్ హీరోయిన్. సత్యరాజ్, జిషు సేన్‌గుప్తా కీలక పాత్రలు పోషించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రెండు పాటలను విడుదల చేయగా, త్వరలోనే మూడో పాట, ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.