
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రానికి సంబంధించి లెటెస్ట్ అప్ డేట్ వచ్చింది. సెప్టెంబర్ 02వ తేదీన తమ అభిమాన హీరో బర్త్ డే సందర్భంగా... ఏదైనా చిత్రానికి సంబంధించిన న్యూస్ వస్తుందని ఫ్యాన్స్ భావించారు. వారనుకున్నట్లుగానే... ‘హరిహర వీరమల్లు’ చిత్ర టీం అదిరిపోయే న్యూస్ వినిపించింది. సెప్టెంబర్ 02వ తేదీ సాయంత్రం 5.45 గంటలకు ‘పవర్ గ్లాన్స్’ విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
పవర్ గ్లాన్స్ అభిమానులను ఉర్రూతలూగించడం ఖాయమని చిత్ర టీం భావిస్తోంది.పాతికేళ్ల కెరీర్‌లో ఎప్పుడూ హిస్టారికల్ సబ్జెక్ట్స్ టచ్ చేయలేదు పవన్ కళ్యాణ్. ఈ జానర్‌లో ఫస్ట్ టైమ్ ‘హరిహర వీరమల్లు’ చేస్తున్నారాయన. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోంది. కరోనా కారణంగా.. షూటింగ్ లకు పలుసార్లు అంతరాయం ఏర్పడింది. మెగా సూర్య ప్రొడక్షన్స్ పై ఏఎం రత్నం భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
A grand, fiery #PowerGlance of #HariHaraVeeraMallu is coming on the special day, 2nd Sept at 05:45pm ?
— BA Raju's Team (@baraju_SuperHit) August 31, 2022
Get ready for a Massive Blitz?@PawanKalyan @DirKrish @AgerwalNidhhi @mmkeeravaani @AMRathnamOfl @ADayakarRao2 @gnanashekarvs @saimadhav_burra @venupro @MegaSuryaProd pic.twitter.com/rgs4lHdRoy