కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లు వేసి వేసి చేతులు నొప్పి పెట్టినయ్

కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లు వేసి వేసి చేతులు నొప్పి పెట్టినయ్

సిద్దిపేట : కస్తూర్బా మోడల్ స్కూల్ పదో తరగతి విద్యార్థులకు 10/10 రిజల్ట్స్ రావాలన్నారు మంత్రి హరీష్ రావు. శుక్రవారం మిరుదొడ్డి గ్రామంలో కేజీబీవీ అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు హరీష్‌ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భగా మట్లాడిన మంత్రి..  పది, ఇంటర్‌ పరీక్షల్లో వందశాతం ఫలితాలు వచ్చేలా ప్రిన్సిపాల్, స్పెషల్ ఆఫీసర్లు కృషి చేయాలన్నారు. ఎంపిడిఒ, ఎంఇఓ ఆధ్వర్యంలో మిరుదొడ్డి మండలంలో 100% శాతం అక్షరాస్యత సాధించాలని సూచించారు.  పాఠశాలలు విజిట్ చేయడం లేదని డిఇఓ , ఎంఇఓ పై మండిపడ్డ హరీష్..  పలు శాఖల అధికారులతో స్టేజీపైనే ఎవరెవరు ఎంత పని చేశారు, ఇంకా ఎంత పెండింగ్ ఉందని ఆరా తీశారు.

సర్పంచ్ లు ప్రతి గ్రామాన్ని స్వచ్ గ్రామంగా తీర్చిదిద్దాలి

రికార్డు సమయంలోనే మల్లన్నసాగర్ పూర్తి చేసుకుంటున్నామని తెలిపిన హరీష్.. త్వరలోనే సాగునీరు తెచ్చుకుంటామన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాకా కరెంటు కొరత లేదని.. త్వరలోనే సాగునీరు అందుతుందన్నారు. ఆర్థికమాంద్యం వచ్చి పైసల్ లేకుంటే ఇంకేదైన పని వాయిదా వేసుకుంటాము కానీ.. గరీబోల్లకు మాత్రం సాయం తప్పదన్నారు. గోదావరి నీటితో చెరువు కుంటలు నింపుకొని.. రెండు పంటలు పండించే విధంగా చూస్తామని తెలిపారు. గతంలో మంచినీరు కావాలని కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లు వేసి వేసి చేతులు నొప్పి పెట్టినయ్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఒకవైపు సంక్షేమం.. మరోవైపు అభివృద్ధితో దూసుకుపోతుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు నూకలు చెల్లినయని.. రేపటి మున్సిపల్ ఎన్నికల్లో దుబ్బాకలో ఒక్కటి గూడా బీజేపీ, కాంగ్రెస్ గెలవదన్నారు మంత్రి హరీష్.

దోమలు, ఈగలు లేని చీకోడ్ గ్రామంగా చేసే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు హరీష్. మహిళలకు రాబోయే రోజుల్లో వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తామన్న హరీష్..  క్యాన్సర్ భీమారు తగ్గాలంటే ప్లాస్టిక్ నిషేధించాలన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే అన్నిటిలో తెలంగాణ ముందుందని.. చదువులో మాత్రం వెనుకుందన్నారు. చీకోడ్ గ్రామంలో 100% అక్షరాస్యత సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి చీకోడ్ గ్రామానికి వచ్చి మీరు కోరిన విధంగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు మంత్రి హరీష్ రావు.