హరీష్.. డబ్బులు తీసుకొచ్చే పోస్ట్ మ్యాన్ : మంత్రి కోమటిరెడ్డి

హరీష్.. డబ్బులు తీసుకొచ్చే పోస్ట్ మ్యాన్ : మంత్రి కోమటిరెడ్డి

బీఆర్ఎస్ నేత హరీష్ రావు పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శలు గుప్పించారు. హరీష్ రావు ఒక పోస్ట్ మ్యాన్.. కాంట్రాక్టర్ల కాడ డబ్బులు తీసుకోచ్చే పని చేస్తాని విమర్శించారు. అసెంబ్లీలో కోమటిరెడ్డి మాట్లాడారు. ప్రాజెక్టులను డిజైన్ చేసే దగ్గర నుంచి పూర్తి అయ్యేదాక అంతా ఇంజనీర్ తానై చూసుకున్నా అని చెప్పిన కేసీఆర్ ఇప్పుడ ఇరిగేషన్ పై చర్చ నడుస్తుంటే కేసీఆర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కేసీఆర్ వచ్చి మాట్లాడితే బాగుంటుందని తెలిపారు. హరీష్ రావు ఒక పోస్ట్ మ్యాన్ కాంట్రక్టర్ల నుంచి డబ్బు సంచలు తీసుకుచ్చి ఇచ్చే అతనని విమర్శించారు. 

2013 ఎన్నికల ప్రచారానికి సూర్యాపేటలో బీఆర్ఎస్ నాయకులు బహిరంగ సభలో ఓ మాట తమ పై దూషణలు చేశారని చెప్పారు. ఎస్ఎల్బీసీ సొరంగం తరుగుతలేదని రేపు తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడే కుర్చీ వేసుకుని ప్రాజెక్టును పూర్తి చేస్తానని వాగ్దానాలు చేశారని గుర్తుచేశారు. అది పూర్తి చేసి ఉంటే పోతిరెడ్డి పాడు ఉండక పోతుండేదని అన్నారు.  బీఆర్ఎస్ నాయకుల కమిషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని మంత్రి కోమటిరెడ్డి విమర్శించారు.