పోలవరంతో 2 లక్షల ఎకరాలు పోతుంటే.. కళ్లు మూసుకున్నారా : మంత్రి భట్టి

పోలవరంతో 2 లక్షల ఎకరాలు పోతుంటే.. కళ్లు మూసుకున్నారా : మంత్రి భట్టి

పోలవరం ప్రాజెక్ట్ కింద తెలంగాణ రాష్ట్రంలోని 2 లక్షల ఎకరాలు ముంపునకు గురవుతుంటే.. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం కళ్లు మూసుకుని చూస్తూ ఉందని.. ఏపీ రాష్ట్రానికి మేలు జరిగే విధంగా తెలంగాణ రైతులను నాశనం చేసిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పోలవరం ప్రాజెక్టు వల్ల 2 లక్షల ఎకరాలు కోల్పోతుంటే చూస్తూ ఉన్న కేసీఆర్.. తుమ్మడిహట్టి ప్రాజెక్టు వల్ల ముంపునకు గురవుతున్న 3 వేల ఎకరాలను మాత్రం తీసుకోలేకపోయిందన్నారు. ప్రధానమంత్రి మోదీ చెప్పారని వదిలేసినట్లు చెబుతున్న కేసీఆర్.. పోలవరం విషయంలో పట్టుబట్టి ఉంటే.. మహారాష్ట్ర దగ్గర 3 వేల ఎకరాలు తీసుకునే అవకాశం ఉందన్నారు.

పదేళ్ల కేసీఆర్ పాలనలో ఇరిగేషన్ లో విధ్వంసం జరిగిందని.. పక్క రాష్ట్రాలతో అన్నీ సమస్యలు తెచ్చి పెట్టారని.. తెలంగాణ ప్రాజెక్టులు నిర్వీర్యం అయితే.. ఏపీ రాష్ట్రం నీళ్ల దోపిడీ చేస్తూ.. తెలంగాణను ఎండగడుతుందన్నారు భట్టి విక్రమార్క. కేసీఆర్ చేసిన ఇరిగేషన్ విధ్వంసాన్ని సరి చేయటానికి చాలా కష్టపడుతున్నామని.. లక్షల కోట్ల అప్పులు పెట్టాడని.. పనికి రాకుండా పోయిన ప్రాజెక్టులు కనిపిస్తున్నాయన్నారు.