ఆరు గ్యారంటీల అమలు ఏమైంది? :హరీశ్ రావు

ఆరు గ్యారంటీల అమలు ఏమైంది? :హరీశ్ రావు

హైదరాబాద్, వెలుగు : ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టేందుకు హామీలు ఇవ్వడం.. అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయలేక చేతులెత్తేయడం కాంగ్రెస్​కు అలవాటేనని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. రాష్ట్రంలో అధికా రంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ లీడర్లు ఇష్ట మొచ్చినట్టు హామీలు ఇచ్చారని మండిపడ్డా రు. ఆరు గ్యారంటీల అమలు ఏమైందని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పాటై వంద రోజులు దాటినా.. ఒక్క హామీ అమలు చేయలేదన్నారు. శనివారం తుక్కుగూడ లో నిర్వహించనున్న కాంగ్రెస్ జనజాతర సభలో పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసేందుకు రాహుల్ వస్తున్న నేపథ్యంలో ఆయనకు హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. ‘‘హామీలు ఇవ్వడం.. చేతులెత్తేయడం కాంగ్రెస్​కు కొత్త కాదు. 2004, 2009, 2023 ఎన్నికల సమయంలోనే ఈ విష యం రుజువైంది. అటు కేంద్రంలో.. ఇటు రాష్ట్రంలో చాలా సార్లు మాట తప్పారు. మళ్లీ ఏ ధైర్యంతో మేనిఫెస్టో రిలీజ్ చేస్తు న్నారో అర్థం కావడం లేదు.

అసలు మీ మేనిఫెస్టోకు ఏమైనా విలువ ఉన్నదా? ఒక్క దాన్నైనా అమలు చేశారా? వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నరు.. 120 రోజులు అవుతు న్నయ్.. అయినా, గ్యారంటీలు అమలు కాలేవు. తుక్కుగూడ సభలో రూ.2లక్షల రుణమాఫీపై స్పష్టమైన ప్రకటన చేయాలి’’అని డిమాండ్ చేశారు.