రైతుబంధును ఆపింది కాంగ్రెస్సే.. రైతుల వ్యతిరేక పార్టీ కాంగ్రెస్: హరీశ్ రావు

రైతుబంధును ఆపింది కాంగ్రెస్సే.. రైతుల వ్యతిరేక పార్టీ కాంగ్రెస్: హరీశ్ రావు

రైతుల నోటి కాడి బుక్కను కాంగ్రెస్ పార్టీ లాగేసిందని మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. ఇటీవల రైతుబంధు నిధుల విడుదలకు అనుమతించిని ఈసీ.. 2023, నవంబర్ 27వ తేదీన రైతుబంధుపై అనుమతిని ఉపసంహరించుకుంది.  ఎన్నికల ప్రచారంలో హరీశ్ రావు రైతుబంధును ప్రస్తావిచడంతోనే నిధుల విడుదల అనుమతిని నిరాకరిస్తున్నట్లు ఈసే పేర్కొంది. దీంతో రేపటి(నవంబర్ 28) నుంచి రైతుల ఖాతాలో పడతాయనుకున్న రైతుబంధు నిధులను ప్రభుత్వం నిలిపేయాల్సి వచ్చింది. రైతుబంధు నిధుల విడుదలకు ఈసీ నిరాకరించిన నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు తెలంగాణ భ‌వ‌న్‌లో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతోనే రైతుబంధును ఈసీ నిలిపేసినట్లు చెప్పారు. ఎన్నికల ముందు రైతుబంధు నిధులు విడదులకు ఈసీ ఎట్లా అనుమతిస్తుందని.. మోడీ అండతోనే కేసీఆర్ రైతుబంధును వేస్తున్నట్లు రేవంత్ అన్నాడని.. మరి, ఇప్పుడు ఈసీ రైతుబంధును నిలిపేసిందని.. దీనికి రేవంత్ ఏం సమాధానం చెప్తాడని మండిపడ్డారు.

బీజేపీ,బీఆర్ఎస్ రెండు ఒక్కటేనని తప్పుడ ప్రచారం చేశాడని దుయ్యబట్టారు. రేవంత్, రైతుల పట్ల అక్కసు వెల్లగక్కుతున్నాడని.. రైతులకు మూడు గంటల కరెంట్ చాలని అంటున్నాడని విమర్శించారు. రేవంత్ కు వ్యవసాయంపై అవగాహన లేదని.. రైతులపై కక్ష కట్టాడని హరీశ్ రావు ఆరోపించారు. రైతులను మోసం చేస్తూ.. దొంగే దొంగ అన్నట్లుగా కాంగ్రెస్ తీరు ఉందని ఆయన ధ్వజమెత్తారు. రైతుల వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ కు ఓట్లతోనే బుద్ధి చెప్పాలని హరీశ్ రావు అన్నారు.