- నెలనెలా డబ్బులు కట్చేసుకుంటున్నా ఎందుకింత వివక్ష: హరీశ్ రావు
హైదరాబాద్, వెలుగు: పోలీసు సిబ్బందికి హెల్త్ కార్డు ద్వారా అందించే వైద్య సేవలను కేవలం నిమ్స్ ఆసుపత్రికే పరిమితం చేయడం దుర్మార్గమైన చర్య అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. పోలీసుల జీతాల నుంచి నెలనెలా ఆరోగ్య భద్రత కోసం డబ్బు కట్ చేసుకుంటున్న ప్రభుత్వం, వారికి వైద్య సేవలు అందించడంలో వివక్ష చూపుతోందని శుక్రవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.
పోలీసులంటే సీఎంకి ఎందుకంత కక్ష అని ప్రశ్నించారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో పోలీసుల కుటుంబాలకు సకాలంలో వైద్యం అందడం లేదన్నారు. అక్టోబర్‌లో గుండెపోటుకు గురైన ఏఆర్ ఎస్సై జనార్దన్‌రావును సకాలంలో ప్రైవేటు ఆస్పత్రికి తరలించినా.. హెల్త్‌కార్డు నిరాకరించడంతో మృతి చెందారన్నారు.
