50 వేల కోట్ల స్కామ్ బయట పెట్టా.. అందుకే నన్ను టార్గెట్ చేస్తున్నారు

50 వేల కోట్ల స్కామ్ బయట పెట్టా.. అందుకే నన్ను టార్గెట్ చేస్తున్నారు

రామగుండం థర్మల్ విద్యుత్ కేంద్రంలో రూ.50 వేల కోట్ల స్కాంను బయటపెట్టినందుకే  తనను టార్గెట్ చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. థర్మల్ విద్యుత్ ను తగ్గిస్తామని చెప్పి కొత్త ప్లాంటు ఎందుకు కడుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. కమీషన్ల కోసమే కొత్త థర్మల్ ప్లాంట్ నిర్మిస్తున్నారని ఆరోపించారు. రూ.10,800 కోట్లతో జెన్కో డీపీఆర్ ఇచ్చింది వాస్తవం కాదా.? అని ప్రశ్నించారు. ఎన్టీపీసీ వాళ్లు రూ. 4.12 పైసలకు యూనిట్ ఇస్తామంటే ప్రభుత్వం ముందుకు రాలేదన్నారు .ఎన్టీపీసీ 2400 మెగావాట్ల విద్యుత్ ఇస్తామంటే ఎందుకు ముందుకు రావట్లేదని ప్రశ్నించారు హరీశ్. 

రామగుండం కొత్త ధర్మల్ ప్రాంట్ తో రోజూ ప్రజలపై రూ. 9 కోట్ల భారం పడుతుందని చెప్పారు హరీశ్ .  25 ఏండ్లకు కొత్త ప్లాంట్ తో  ప్రజలపై రూ. 82 వేల కోట్ల భారం పడుతుందన్నారు. తక్కువ ధరకు వచ్చే విద్యుత్ ను ఎందుకు వద్దంటున్నారని ప్రశ్నించారు. రూ.82 వేల కోట్ల భారం ప్రజలెందుకు భరించాలన్నారు హరీశ్.  కాంగ్రెస్ వచ్చిన తర్వాతే కరెంట్ లో ఈ దుస్థితి వచ్చిందన్నారు. 

విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని హరీశ్​రావు ఆరోపించారు. ఇప్పటికే ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ ఉండగా కొత్త డిస్కమ్ ఎందుకని ప్రశ్నించారు. ‘‘కేంద్ర ప్రభుత్వ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే రేవంత్ యాక్షన్​ చేస్తున్నారు. కమీషన్లను దండుకునేందుకే ఇలాంటి స్కామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు తెరదీశారు. అండర్ గ్రౌండ్ కేబుల్స్, పంప్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టోరేజీ, బ్యాటరీ స్టోరేజీ కరెంట్ సహా ఇంటర్​స్టేట్ స్కామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నూ త్వరలోనే ఆధారాలతో సహా బయటపెడతాం” అని తెలిపారు.

►ALSO READ | మహిళా సంఘాలకు 448 ఆర్టీసీ అద్దెబస్సులు