రాష్ట్రంలో 38 శాతం మందికి బీపీ, షుగర్

 రాష్ట్రంలో 38 శాతం మందికి బీపీ, షుగర్

సర్వే ప్రకారం రాష్ట్రంలో 24 శాతం షుగర్, 14 శాతం బీపీ కేసులు ఉన్నాయన్నారు మంత్రి హరీశ్ రావు. ఒకప్పుడు అంటు వ్యాధులు ఎక్కువగా ఉంటే ఇపుడు అంటు వ్యాధులు కానివి అధికమవుతున్నాయన్నారు. సెప్టెంబర్ 29న  హైదరాబాద్ లోని దుర్గం చెరువు దగ్గర కార్డియాలజిస్ట్ సొసైటీ తెలంగాణ వరల్డ్  హార్ట్ డే కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుూ  మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, కనీస వ్యాయామం చేయకపోవడం, చెడు అలవాట్లు, మానసిక ఒత్తిళ్లు వంటివి దీనికి కారణమని చెప్పారు. 

ఇటీవల ప్రభుత్వం బీపీ, షుగర్ మందులను ఉచితంగా అందిస్తుందన్నారు. ప్రాథమిక దశలోనే బీజీ, షుగర్ లను గుర్తించి చికిత్స తీసుకోకపోవం వల్ల దీర్ఘకాలిక రోగాలకు కారణం అవుతున్నాయన్నారు. వాటివల్ల గుండె, కిడ్నీలు, కాలేయం వంటి ముఖ్యమైన అవయవాలు దెబ్బతింటున్నాయని తెలిపారు. సడెన్ కార్డియాక్ అరెస్ట్ వల్ల దేశంలో ఏటా సుమారు 15 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. సమయం, సందర్భంగా చిన్నా,పెద్దా అనే తేడా లేకుండా ఎవరికైనా సడెన్ కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశం ఉంటుందన్నారు. అయితే  సకాలంలో సీపీఆర్ చేయడం వల్ల వీరి ప్రాణాలు కాపాడటం సాధ్యమవుతుందన్నారు. సీపీఆర్ గురించి మన దేశంలో  98 శాతం మందికి తెల్వదన్నారు హరీశ్ రావు.