చినుకు పడకముందే రైతుల ఖాతాల్లో డబ్బులు

చినుకు పడకముందే రైతుల ఖాతాల్లో డబ్బులు

సంగారెడ్డి జిల్లా: తెలంగాణ కోసం జీవితమంతా కొట్లాడిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్  అన్నారు మంత్రి హరీష్ రావు. సోమవారం ఆయన..ఆందోల్, నారాయఖేడ్ నియోజకవర్గాల్లో పర్యటించారు. ఈ క్రమంలోనే సిందోల్ లో రూ.2.25 కోట్లతో నిర్మించనున్న  పనులకు హరీష్ రావు శంకుస్థాపన చేశారు. అనంతరం నారాయణ ఖేడ్ నియోజకవర్గం, మనూర్ మండలం, బొరంచ శివారులో బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ సర్వే పనులను ప్రారంభించారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా మట్లాడిన హరీష్.. జయశంకర్ సార్ అడుగుజాడల్లో నడుస్తూ నీళ్లు, నిధులు , నియామకాలు చేపడుతామన్నారు. 33 జిల్లాల తెలంగాణలో వంద శాతం డంపింగ్ యార్డులు, వైకుంఠ దామాలు నిర్మించిన జిల్లా సంగారెడ్డి జిల్లా అన్నారు.  ఉమ్మడి రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా పూర్తిగా వేనుకబడిందని...తెలంగాణ రాష్ట్రం వచ్చాక అభివృద్ధిలో దూసుకుపోతుందని తెలిపారు. 70 ఏళ్ల  కాంగ్రెస్, టీడీపీ పాలనలో చుక్క నీరు రాలెదన్నారు. గత ప్రభుత్వాలు సాగునీరు కాదు కాదా తాగునీరు ఇవ్వలేదని..టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఇంటింటికి తాగునీరు అందించామన్నారు.

పొలం వాకిట్లోకి నీళ్లు రావడమే బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ పథకమన్న ఆయన..  బసవేశ్వర ప్రాజెక్ట్ ద్వారా 8 టీఎంసీల నీరు అందించి,  లక్ష 40 వేల ఎకరాలను సాగులోకి తెస్తున్నామన్నారు. కాళేశ్వరం ద్వారా నారాయణ ఖేడ్ కు సాగునీరు అందిస్తామని.. తెలంగాణలో యాసంగిలో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్నామన్నారు. ఆంధ్రోళ్లు ఒకరోజు ఎక్కిరిచ్చటోళ్లు..నేడు ఈర్ష పడుతున్నారని తెలిపారు. రైతుబందు ఇప్పటివరకు 6,012 కోట్లు ఖరీఫ్ సీజన్ కు అందించామని..రైతు బంధు పథకం రైతాంగానికి గొప్ప వరం అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో బ్యాంక్ లో అప్పు కూడా దొరకక పోతుండే నని.. చినుకు పడకముందే రైతు ఖాతాల్లో డబ్బులు వేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిది అన్నారు. గతంలో ఎరువుల కోసం లైన్లు కడితే..నేడు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.ఈ భూమ్మీద రైతు భీమా ఇచ్చేది తెలంగాణ ప్రభుత్వం ఒక్కటే అన్నారు. ధరణితో రైతుకు లాంచల బాధ తప్పిందని..టిఆర్ఎస్ సర్కార్ ప్రజల కోసం, రైతుల కోసం పనిచేస్తుందని..నారాయణ ఖేడ్ నియోజకవర్గంలో పాఠశాలల  అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని తెలిపారు మంత్రి హరీష్ రావు.