బాసర, వెలుగు: బాసర జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని దుకాణాల వేలం పాటతో ఆలయానికి రూ.2 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో అంజనీ దేవి తెలిపారు. ఆలయం ఆఫీస్ లో మంగళవారం వేలం పాట నిర్వహించారు. అమ్మవారి చీరలు సేకరించి అమ్ముకొనే షాప్ నిర్వహణకు రూ. 85 లక్షలు, పూజా సామాగ్రి సేల్స్ కౌంటర్ షాప్ రూ.61.61 లక్షలు, సెల్ ఫోన్లు భద్రపర్చే షాప్ రూ.20.20 లక్షలు, ఇతర షాప్ లతో కలిపి రూ.2.02 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఈవో తెలిపారు.
