పాల్వంచ,వెలుగు: కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థల ప్రైవేటీ కరణ విధానాలను నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్ వద్ద అంబేద్కర్ సెంటర్ లో నేషనల్ కో ఆర్డినేషన్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఇంజనీర్స్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా కేటీపీఎస్ తెలంగాణ జెన్కో పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ బ్రాంచి కార్యదర్శి డి. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన న్యూక్లియర్ బిల్లు, ఎలక్ట్రిసిటీ అమెండమెంట్ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు. జేఏసీ నేతలు బ్రహ్మాజీ, యాస్మిన్, పావని పాల్గొన్నారు.
