ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనుల్లో మరో గండం.. ఇన్‌లెట్ వద్ద 10 మీటర్ల షియర్ జోన్ గుర్తింపు

ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనుల్లో మరో గండం.. ఇన్‌లెట్ వద్ద 10 మీటర్ల షియర్ జోన్ గుర్తింపు
  •     ఇన్‌‌లెట్ ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే..
  •     140 మీటర్ల దూరంలో సమాంతరంగా పనులు
  •     అక్కడే 10 మీటర్ల షియర్ జోన్ ఉన్నట్టు గుర్తింపు
  •     మూడు రోజుల్లో ఆ గండం దాటేస్తామంటున్న అధికారులు


హైదరాబాద్, వెలుగు: ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్బీసీ సొరంగం పనుల్లో మరో ప్రమాదం ఎదురైంది. ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెట్ వద్ద మరో షియర్ జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అధికారులు గుర్తించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ సారి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, ప్రాణనష్టం లేకుండా చూస్తూ ముందుకు సాగుతున్నారు. నిరుడు ఫిబ్రవరిలో ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెట్ నుంచి లోపల 13.90 కిలోమీటర్ల పాయింట్ వద్ద షియర్ జోన్ కారణంగా టన్నెల్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ ప్రాంతాన్ని వదిలేసి దానికి సమాంతరంగా 140 మీటర్ల దూరంలో పనులు చేస్తున్నారు. టన్నెల్ బోరింగ్ యంత్రాన్ని పక్కనపెట్టి.. డ్రిల్లింగ్-బ్లాస్టింగ్ పద్ధతిలో తవ్వకాలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా అదే పాయింట్ వద్ద షియర్ జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అధికారులు గుర్తించారు. ఆ షియర్ జోన్ దాదాపు 10 మీటర్ల మేర విస్తరించి ఉన్నట్టు తేల్చారు. ఈ క్రమంలోనే టన్నెల్ పైకప్పు కూలకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. పైకప్పు, సైడ్లను పటిష్ఠంగా ఉంచేలా రాక్ బోల్టులు, స్టీల్ రిబ్స్ వంటి వాటిని ఉపయోగిస్తూ టన్నెల్ పైకప్పుపై ప్రభావం పడకుండా చూస్తున్నారు. ప్రస్తుతం ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెట్ వద్ద ఈ షియర్ జోన్ వల్లే పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. మరో మూడు రోజుల్లో ఈ గండం గట్టెక్కుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ మూడు రోజుల పాటు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పనులు చేస్తున్నారు. మైక్రో లెవెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కంట్రోల్డ్ బ్లాస్టింగ్ చేస్తున్నారు.

రంగంలోకి త్రీ-ఆర్మ్డ్ బూమర్ మెషీన్లు

సొరంగం తవ్వకాల్లో భద్రతను పటిష్ఠం చేసేందుకు, పనులను వేగవంతం చేయడానికి ప్రభుత్వం అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నది. వివిధ దేశాల్లో వాడుతున్న టెక్నాలజీలపై స్టడీ చేసిన అధికారులు.. అత్యాధునిక ‘త్రీ-ఆర్మ్డ్ బూమర్’ డ్రిల్లింగ్ మెషీన్లను తెప్పించారు. కొద్ది రోజుల కిందటే సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆ యంత్రాలు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. దాంతో పనులు మరింత వేగం పుంజుకుంటాయని వివరిస్తున్నారు. ఇప్పటికే పనులు ఆశించిన వేగంతోనే సాగుతున్నాయి. ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెట్, ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెట్ కలిపి 470 మీటర్ల మేర టన్నెల్ తవ్వకాన్ని పూర్తి చేశారు. రోజూ 10 నుంచి 12 మీటర్ల తవ్వకాన్ని టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పెట్టుకుని అధికారులు ముందుకు సాగుతున్నారు.