ప్రభాస్ ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ ఫిక్స్

ప్రభాస్ ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ ఏడాది ప్రారంభంలో ‘రాజా సాబ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ప్రభాస్..  ఇయర్‌‌‌‌‌‌‌‌ ఎండింగ్‌‌‌‌లో  మరోసారి ఆడియెన్స్‌‌‌‌ను పలకరించబోతున్నాడు.   ప్రస్తుతం ఆయన వరుస  ప్రాజెక్టుల్లో నటిస్తుండగా,  వాటిలో హను రాఘవపూడి రూపొందిస్తున్న చిత్రం ‘ఫౌజీ’. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. శనివారం ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ మూవీ రిలీజ్ డేట్‌‌‌‌ను అనౌన్స్  చేశారు మేకర్స్.  డిసెంబర్ 3న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

 రిలీజ్ డేట్ పోస్టర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని క్రియేట్ చేసింది.  ‘స్వాతంత్ర్యం ఒక వేడుకగా మారకముందు.. అది ఎందరో వీరుల త్యాగాలతో సాగిన పోరాటం.  మన రేపటి స్వేచ్ఛ కోసం తమ రోజును త్యాగం చేసిన ప్రతి ఫౌజీకి శతకోటి వందనాలు. దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన ప్రతి సైనికుడి ధైర్యానికి, త్యాగానికి సెల్యూట్. దేశభక్తి అనేది కేవలం ఒక భావన కాదు..  అది తరతరాలకు స్ఫూర్తినిచ్చే త్యాగగాథ’  అంటూ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను ట్యాగ్ చేయడం ఆసక్తిని పెంచింది.  ఇందులో ప్రభాస్‌‌‌‌ను ఇంతకుముందు ఎప్పుడూ చూడని పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌లో  చూపించబోతున్నామని మేకర్స్ అన్నారు.  ఇమాన్వీ హీరోయిన్‌‌‌‌.  అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, భాను చందర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. టి-సిరీస్ సమర్పణలో  మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్‌‌‌‌తో నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు.