హరీశ్.. పాలమూరుపై చర్చకు సిద్ధమా : జూపల్లి కృష్ణారావు

హరీశ్.. పాలమూరుపై చర్చకు సిద్ధమా : జూపల్లి కృష్ణారావు
  •  కాలువలు తవ్వకుండానే ప్రాజెక్టు ప్రారంభించారని మండిపాటు
  • ఎంపీ ఎన్నికల కోసమే పంట నష్టాలపై బీఆర్ఎస్ డ్రామాలాడుతోందని ఫైర్
  • రైతులకు పరిహారం ఇచ్చేందుకు రెడీగా ఉన్నామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: పాలమూరు ఎత్తిపోతల పథకానికి కాలువలు తవ్వకుండానే కేసీఆర్ ప్రాజెక్టును ప్రారంభించారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్ అయ్యారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇప్పటికీ అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ రాలేదన్నారు. దీనిపై హరీశ్ రావు చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు పదేండ్లపాటు ప్రజాధనం దోచుకుతిన్నారని, మళ్లీ దోచుకునేందుకే హరీశ్ రావు సచివాలయం ముట్టడి అంటున్నారని మండిపడ్డారు. మంగళవారం గాంధీ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, వీర్లపల్లి శంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి మంత్రి జూపల్లి మీడియాతో మాట్లాడారు.

 పంట నష్టం‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై తమ ప్రభుత్వం సర్వే చేస్తోందని, పరిహారం ఇవ్వడానికి సర్కారు సిద్ధంగా ఉందని చెప్పారు. ఎంపీ ఎన్నికల కోసమే బీఆర్ఎస్ పంట నష్టంపై డ్రామాలు ఆడుతోందన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్కసారైనా పంట నష్ట పరిహారం ఇచ్చారా అని ప్రశ్నించారు. కేసీఆర్ పాలన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 6 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని జూపల్లి ఆరోపించారు. రానున్న వానాకాలం నుంచి అన్ని పంటలకు బీమా సౌకర్యం కాంగ్రెస్ ప్రభుత్వమే కల్పిస్తుందని చెప్పారు. 

బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఉన్న శ్రద్ధ.. రైతులపై లేదన్నారు. మేడిగడ్డ నిర్వాకం జరగకపోయి ఉంటే, కాళేశ్వరం ప్రాజెక్టును సరిగా నిర్మించి ఉంటే నేడు సాగు నీటి కష్టాలు వచ్చేవి కావన్నారు. రాష్ట్రంలోని నీటి ఎద్దడికి బీఆర్ఎస్ కారణమన్నారు. వానాకాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉందని, వర్షాకాలం తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. నీటి నిల్వలను ముందే బీఆర్ఎస్ ఎందుకు పెంచలేదని జూపల్లి ప్రశ్నించారు. 

బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క పైసా ఇయ్యలే: కసిరెడ్డి నారాయణరెడ్డి

రైతు‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల గురించి మాట్లాడే నైతిక విలువ హరీశ్​ రావు‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు లేదని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. పాలమూరు‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం గాలికొదిలేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. కల్వకుర్తి ప్రాజెక్టు కింద భూమి కోల్పోయిన వారికి పదేండ్లలో బీఆర్ఎస్ సర్కారు పైసా ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ నేతలు సచివాలయం ముట్టడిస్తామంటే.. రైతులు బీఆర్ఎస్ నేతల ఇండ్లు ముట్టడిస్తారన్నారు. షాద్ నగర్ ఎమ్మె్ల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ, హరీశ్ రావు ఆర్థిక నేరగాడని ఆరోపించారు.