
- పవర్ బ్రోకర్లు, అవకాశవాదులే పార్టీ నుంచి పోతున్నరు: హరీశ్‌రావు
సిద్దిపేట రూరల్/ దుబ్బాక, వెలుగు: కష్టకాలంలో వెళ్లిపోతున్న పవర్బ్రోకర్లు, అవకాశవాదులు రేపు కాళ్లు మొక్కినా పార్టీలోకి రానిచ్చేది లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. శుక్రవారం సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి వెంకట్రామి రెడ్డి తో కలిసి హాజరయ్యారు. ఎవరైతే మధ్యలో మన పార్టీలోకి వచ్చారో.. వారే వెళ్లిపోతున్నారని, కార్యకర్తలు ఎవరూ వెళ్లడంలేదని హరీశ్ పేర్కొన్నారు.