మా వల్లే కాంగ్రెస్ గెలిచింది.. ఆ పార్టీకి జీవం పోసిందే కేసీఆర్: హరీశ్ రావు

మా వల్లే కాంగ్రెస్ గెలిచింది.. ఆ పార్టీకి జీవం పోసిందే కేసీఆర్: హరీశ్ రావు

టీఆర్ఎస్ పార్టీ వల్లే 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు.   కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిందే తామన్నారు. చంద్రబాబు హయాంలో కాంగ్రెస్ ఓడిపోయి ప్రతిపక్ష హోదా దక్కకుండా దిగజారిపోయిందన్నారు. అప్పుడు కాంగ్రెస్  పార్టీకి జీవం పోసిందే కేసీఆర్ అని చెప్పారు.  కాంగ్రెస్ గెలిస్తే పదవులు ఇవ్వలేదని... తాము పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీకి భిక్ష పెట్టామని చెప్పారు హరీశ్. రేవంత్ ఏబీవీపీతో మొదలు పెట్టి టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్  ఇలా పార్టీలు మారారు.. రేవంత్ రేపు ఏ పార్టీలో ఉంటారో తెల్వదన్నారు. పార్టీలు మారని చరిత్ర తమదన్నారు. 

అంతకుముందు మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. గత పాలనలో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గా కేసీఆర్ కు  అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు . గత పాలనలో కేసీఆర్ ను ఎంపీగా గెలిపించిందే కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. కేంద్రమంత్రిగా అవకాశం ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీయే అని అన్నారు. 

తెలంగాణ ఉద్యమంలో కేకే మహేందర్ రెడ్డి చురుగ్గా పాల్గొని.. సిరిసిల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేశారని, అదే సమయంలో మేనేజ్ మెంట్ కోటాలో కేటీఆర్ సిరిసిల్ల టికెట్ తీసుకుని ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వచ్చారని చెప్పారు. గతం గురించి చర్చించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరితే ఒకరోజు సెషన్ పెట్టాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు.