2 లక్షల రుణమాఫీ ఏప్పుడు చేస్తరు..? సీఎం రేవంత్ కు హరీశ్ లేఖ

2 లక్షల రుణమాఫీ ఏప్పుడు చేస్తరు..? సీఎం రేవంత్ కు  హరీశ్ లేఖ

 రైతు రుణమాఫీ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. రెండు లక్షల రుణమాఫీ ఎప్పుడు చేస్తారని ప్రశ్నించారు.  డిసెంబర్‌ 9నే రుణమాఫీ చేస్తామని మేనిఫెస్టోలో చెప్పారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైనా ఒక్క రైతుకు కూడా రుణమాఫీ  కాలేదన్నారు.  సీఎం రేవంత్ మాటలు నమ్మి  రైతులు లక్షల మంది రైతులు బ్యాంకుల్లో అప్పులు తీసుకున్నారని చెప్పారు.  రుణమాఫీ కావడంతో  బ్యాంకులు రైతులకు  నోటీసులు ఇస్తూ..రైతులపై ఒత్తిడి తెస్తున్నాయని విమర్శించారు హరీశ్. ఉమ్మడి వరంగల్, మెదక్ జిల్లాలో వందలాది మంది రైతులకు బ్యాంకు నోటీసులు అందాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని తెలిపారు.  వడ్డీలు పెరగడంతో రైతులపై ఆర్థిక భారం పెరుగుతుందని ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్ అందక, పంటలు ఎండిపోయాయని చెప్పారు హరీశ్.  సకాలంలో నీళ్లు అందక, ఈ నాలుగు నెలల కాలంలో 209 మంది అన్నదాతలు చనిపోయారని తెలిపారు. రుణమాఫీ విషయంలో బ్యాంకర్ల ఒత్తిళ్లకు, వేధింపులకు తట్టుకోలేక రైతులు ప్రాణం తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.  రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు, పంట మద్దతు ధరపై 500 రూపాయల బోనస్ ఇవ్వాలన్నారు.  ఎకరానికి 15 వేల చొప్పున పెట్టుబడి సాయం, పంటపొలాలకు నీళ్లు, 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు హరీశ్.