పొద్దు తిరుగుడు పంట మొత్తం కొనండి : హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు

పొద్దు తిరుగుడు పంట మొత్తం కొనండి :  హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు

 

  • సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డికి లేఖ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పండిన పొద్దు తిరుగుడు పంట మొత్తాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి, రైతులను ఆదుకోవాలని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డిని మాజీ మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు కోరారు. ఈ మేరకు సోమవారం సీఎంకు హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు ఓ లేఖ రాశారు. రాష్ట్రంలో దాదాపుగా 1.65 లక్షల క్వింటాళ్ల పొద్దు తిరుగుడు పంట దిగుబడి వస్తే, అందులో 25 శాతం మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో మిగిలిన 75 శాతం పంటను రైతులు తక్కువ ధరకు ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవాల్సి వస్తోందన్నారు. తమ సర్కార్ హయాంలో పండిన పంట మొత్తాన్ని మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేశామని, ఇప్పుడు కూడా అదే విధంగా మొత్తం పంటను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఆయన సూచించారు. ప్రతి క్వింటాకు రూ.6760 మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు.