హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు నోటీసులు ఇవ్వడంపై హరీష్ రావు స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొన్న నాకు.. ఇప్పుడు కేటీఆర్‌కు సిట్ నోటీసులు ఇచ్చిందన్నారు. కేటీఆర్, నేను ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నందుకు సిట్ నోటీసులు ఇచ్చిందని ఆరోపించారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా భయపడబోమన్నారు. ప్రభుత్వ అటెన్షన్ డైవర్షన్‌లకు బయపడబోమని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేసే వరకు మీ వెంటపడుతూనే ఉంటామని పేర్కొన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు గురువారం (జనవరి 22) సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు జూబ్లీహిల్స్ నందినగర్‌లోని కేటీఆర్ నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు. 2026, జనవరి 23వ తేదీ ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
►ALSO READ | సంక్రాంతికి రూ. రెండువేల కోట్లు చేతులు మారాయి... ప్రభుత్వమే పందాలను ప్రోత్సహించింది: వైఎస్ జగన్
తెలంగాణ స్టేట్ పాలిటిక్స్‌లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఇటీవలే ఈ కేసులో బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావును సిట్ విచారించిన విషయం తెలిసిందే. దాదాపు 7 గంటల పాటు ఆయనపై సిట్ ప్రశ్నల వర్షం కురిపించింది. హరీష్ రావును ఇంటరాగేట్ చేసిన రెండు రోజుల్లోనే విచారణకు రావాలంటూ కేటీఆర్‌కు సిట్ నోటీసులు పంపడం స్టేట్ పాలిటిక్స్‌లో చర్చనీయాంశంగా మారింది. మరీ కేటీఆర్ విచారణకు హాజరు అవుతారో లేదో చూడాలి.
