
- అధికారిక లాంఛనాలతో అంతిమ వీడ్కోలు
- హాజరైన మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, సబిత
- అంతిమయాత్రకు భారీగా తరలివచ్చిన అభిమానులు
పరిగి, వెలుగు: పరిగి మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ఏపీ మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్ రెడ్డి(78) అంత్యక్రియలు శనివారం పరిగిలోని పల్లవి కాలేజీ వద్ద అధికార లాంఛనాలతో ముగిశాయి. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం రాత్రి10.30 గంటలకు కార్డియాక్ అరెస్టుతో కన్నుమూశారు. హరీశ్వర్ రెడ్డి1994 నుంచి 2009 వరకు టీడీపీ నుంచి పరిగి ఎమ్మెల్యేగా వరుసగా గెలుపొందారు. 2012లో బీఆర్ఎస్లో చేరారు. ఆయన మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు.
హరీశ్వర్ రెడ్డి పార్థివదేహాన్ని ముందుగా ప్రజల సందర్శనార్థం పరిగిలోని ఆయన నివాసంలో ఉంచారు. శనివారం ఉదయం మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, సబిత, జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆయన పార్థివదేహం వద్ద నివాళులర్పించారు. హరీశ్వర్ రెడ్డి తనయుడు, ప్రస్తుత ఎమ్మెల్యే మహేశ్రెడ్డిని, ఆయన కుటుంబసభ్యులను మంత్రి కేటీఆర్ ఓదార్చారు. మధ్యాహ్నం 3 గంటలకు అంతిమయాత్ర మొదలైంది. పరిగిలోని బహార్ పేట మీదుగా హైదరాబాద్– బీజాపూర్ హైవే పక్కన ఉన్న పల్లవి కాలేజీ వరకు అంతిమ యాత్ర కొనసాగింది. హరీశ్వర్ రెడ్డి అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం పల్లవి కాలేజీ ఆవరణలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, పట్నం నరేందర్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి, బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి,