
సుధీర్ బాబు హీరోగా ‘సెహరి’ ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘హరోం హర’. సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసినట్టు మేకర్స్ తెలియజేశారు. డిఫరెంట్ లొకేషన్స్‌లో చిత్రీకరించిన విజువల్స్ ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తాయని మేకర్స్ చెప్పారు. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా శరవేగంగా కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నామన్నారు.
1989 నాటి చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో సుధీర్ బాబు డిఫరెంట్ క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు. మాళవిక శర్మ హీరోయిన్. సునీల్, అక్షర గౌడ కీలకపాత్రలు పోషిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్ సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి.