
సుధీర్ బాబు హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ‘హరోం హర’. ది రివోల్ట్ అనేది ట్యాగ్‌లైన్. ‘సెహరి’ ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నాడు. సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం కొత్త షెడ్యూల్ తాజాగా ఉడిపిలో ప్రారంభమైంది.
30 రోజుల పాటు జరిగే ఈ లాంగ్ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో సుధీర్ పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనున్నాడు. 1989 నాటి చిత్తూరు జిల్లా కుప్పం బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కథ ఇది. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 22న సినిమాను విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.