- ఆరంభ మ్యాచ్‌లకు కమిన్స్, స్టార్క్, హేజిల్‌వుడ్ దూరం
కోల్‌కతా/మెల్‌బోర్న్: ఐపీఎల్ కొత్త సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్ జట్లకు ఎదురుదెబ్బలు తగిలాయి. కేకేఆర్ స్టార్ పేసర్ హర్షిత్ రాణా మోకాలి గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. గత సీజన్లలో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన హర్షిత్ లేకపోవడం తమకు పెద్ద లోటు అని ఆ జట్టు కోచ్ అభిషేక్ నాయర్ ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు శ్రీలంక పేసర్ మతీషా పతిరణ ఇంకా ఫిట్‌నెస్ సాధించలేదు.
తను ఏప్రిల్ రెండో వారం తర్వాతే కేకేఆర్ జట్టులోకి రానున్నాడు. ఇంక ఆస్ట్రేలియా స్టార్ పేసర్లు పాట్ కమిన్స్ (సన్ రైజర్స్), మిచెల్ స్టార్క్ (ఢిల్లీ క్యాపిటల్స్), జోష్ హేజిల్‌వుడ్ (ఆర్సీబీ) పనిభారం, గాయాల కారణంతో టోర్నీ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నారు. కమిన్స్ గైర్హాజరీలో సన్ రైజర్స్ ఇప్పటికే ఇషాన్ కిషన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది.
అదే సమయంలో సన్ రైజర్స్ రూ. 3 కోట్లకు కొనుగోలు చేసిన ఆసీస్ ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ పాదం గాయంతో ఐపీఎల్ నుంచి పూర్తిగా వైదొలిగాడు. ఇక, రాజస్తాన్ రాయల్స్ టీమ్ ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ సేవలను కోల్పోనుంది. గజ్జల్లో గాయం కారణంగా అతను ఈ సీజన్‌కు అందుబాటులో ఉండటం లేదని సమాచారం.ఈ నెల 28న మొదలయ్యే ఈ మెగా టోర్నీలో వరల్డ్ కప్ తర్వాత ఆటగాళ్ల గాయాలు, గైర్హాజరీ ఫ్రాంచైజీల ప్లాన్స్‌ను తలకిందలు చేస్తున్నాయి.
