గ్లోబల్ ర్యాంకింగ్స్లో హార్వర్డ్ వర్సిటీ డౌన్.. మూడో స్థానానికి పడిపోయిన అమెరికా వర్సిటీ

గ్లోబల్ ర్యాంకింగ్స్లో హార్వర్డ్ వర్సిటీ డౌన్.. మూడో స్థానానికి పడిపోయిన అమెరికా వర్సిటీ

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఒకటిగా పేరొందిన హార్వర్డ్ యూనివర్సిటీ.. 2025 గ్లోబల్ ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మూడో స్థానానికి దిగజారింది. చైనాకు చెందిన జెజియాంగ్ యూనివర్సిటీ, షాంఘై జియావో టాంగ్ యూనివర్సిటీ వరుసగా ఫస్ట్, సెకండ్ ప్లేస్​లో నిలిచాయి. నెదర్లాండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని లీడెన్ యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్టడీస్ (సీడబ్ల్యూటీఎస్) ఈ ర్యాంకింగ్ జాబితాను రిలీజ్ చేసింది. టాప్ 10 యూనివర్సిటీల్లో 8 విశ్వవిద్యాలయాలు చైనావే ఉండటం గమనార్హం.

 అమెరికాకు చెందిన హార్వర్డ్ యూనివర్సిటీ 3వ స్థానంలో ఉండగా.. కెనడాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ టొరంటో 10వ ప్లేస్​లో ఉంది. టాప్​ 10లో మిగిలిన వర్సిటీలన్నీ చైనావే ఉన్నాయి. ఈ ర్యాంకింగ్.. ప్రధానంగా యూనివర్సిటీల రీసెర్చ్ ఔట్​పుట్ (పబ్లికేషన్ల సంఖ్య, క్వాలిటీ) ఆధారంగా నిర్ణయించారు. కాగా, ఇండియన్ యూనివర్సిటీల విషయానికి వస్తే.. టాప్ 100లో కూడా మన యూనివర్సిటీలకు స్థానం దక్కలేదు.గ్లోబల్ ర్యాంకింగ్ లో 270 వ స్థానంలో వెల్లూర్  ఇనిస్టిట్యూట్ ఆఫ్​ టెక్నాలజీ(వీఐటీ) నిలిచింది. 

13 ఏండ్ల తర్వాత ఫస్ట్ ప్లేస్ కోల్పోయిన హార్వర్డ్

గత 13 ఏండ్లుగా (2012 నుంచి) ఫస్ట్ ప్లేస్​లో ఉన్న హార్వర్డ్ యూనివర్సిటీ.. ఈసారి మూడో స్థానానికి పడిపోయేందుకు చైనా విశ్వవిద్యాలయాల దూకుడే ప్రధాన కారణం. హై క్వాలిటీ రీసెర్చ్ పరంగా హార్వర్డ్ వర్సిటీ టాప్​లో ఉన్నప్పటికీ.. టోటల్ పబ్లికేషన్ల వాల్యూమ్​లో మాత్రం చైనా వర్సిటీలు వేగంగా పైకిదూసుకొచ్చాయి. హార్వర్డ్ కంటే చైనీస్ వర్సిటీలు స్పీడ్​గా భారీ సంఖ్యలో పబ్లికేషన్ల డాక్యుమెంట్లు విడుదల చేస్తున్నాయి. చైనా ప్రభుత్వం రీసెర్చ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్టార్​పై భారీ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ చేస్తున్నది.

 ప్రధానంగా ఫిజికల్ సైన్సెస్, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ వంటి రంగాల్లో చైనా భారీగా పెట్టుబడులు పెట్టింది. అమెరికాలో ఫెడరల్ రీసెర్చ్ ఫండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మార్పులు, వీసా నిబంధనలు, ఇంటర్నేషనల్ స్టూడెంట్ల సంఖ్య తగ్గడం వంటివి అమెరికన్ వర్సిటీల గ్లోబల్ స్కోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ప్రభావం చూపాయి. ప్రధానంగా ఫిజికల్ సైన్సెస్, ఇంజనీరింగ్ విభాగాల్లో చైనా వర్సిటీలు హార్వర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దాటి ముందుకెళ్లాయి. 20 ఏండ్ల నుంచే హార్వర్డ్ యూనివర్సిటీ రీసెర్చ్ చేస్తున్నా, గ్లోబల్ కాంపిటీషన్ వల్ల ర్యాంక్ పడిపోయింది.

వెల్లూరు ఇనిస్టిట్యూట్​కు 270వ ర్యాంకు

రీసెర్చ్ పబ్లికేషన్ల ఆధారంగా వర్సిటీలకు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్టడీస్ (సీడబ్ల్యూటీఎస్) ర్యాంకులు కేటాయిస్తుంది. ఇండియా నుంచి గ్లోబల్ ర్యాంకింగ్​జాబితాలో వెల్లూరు ఇనిస్టిట్యూట్ (270), ఐఐటీ ఖరగ్ పూర్ (291), ఐఐటీ ఢిల్లీ (297), ఐఐటీ బాంబే (326), ఐఐటీ మద్రాస్ (328) సంస్థలకు చోటు దక్కింది.  జవహర్​లాల్ నెహ్రు యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, అన్నా యూనివర్సిటీలు కూడా సత్తా చాటాయి. 

వరల్డ్ టాప్ 10 వర్సిటీలు (పబ్లికేషన్ల సంఖ్య ఆధారంగా)

1)  జెజియాంగ్ యూనివర్సిటీ (చైనా)

2) షాంఘై జియావో టాంగ్ యూనివర్సిటీ (చైనా)
3) హార్వర్డ్ యూనివర్సిటీ (అమెరికా)
4) సిచువాన్ యూనివర్సిటీ (చైనా)
5) సెంట్రల్ సౌత్ యూనివర్సిటీ (చైనా)
6) హువాజాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (చైనా)
7) సన్ యాట్-సెన్ యూనివర్సిటీ (చైనా)
8) జియాన్ జియావోటాంగ్
యూనివర్సిటీ (చైనా)
9) ట్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హువా యూనివర్సిటీ (చైనా)
10) యూనివర్సిటీ ఆఫ్ టొరంటో (కెనడా)