
మానవత్వాన్ని ఏకం చేసిన హిందుత్వాన్ని ఎవరు అవమాన పరచకూడదని హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ కోరారు. కాచిగూడ లోని రాఘవేంద్ర స్వామి ఆలయంలో చతుర్మాస దీక్షలో ఉన్న పేజావార మఠాధిపతి శ్రీశ్రీ విశ్వప్రసన్న తీర్థ శ్రీపాదుల స్వామిని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. మఠాధిపతుల కారణంగానే హిందు ధర్మం రక్షింపబడుతుందని ఆయన అన్నారు. అన్నివర్గాల ప్రజలకు సామరస్యంగా సామాన్య తన భక్తి భావాలను చాటిన మహనీయులు రాఘవేంద్ర స్వామి అని తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నాయకులతో కలిసి, రాఘవేంద్ర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.