14 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌పై టీ20 మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో శ్రీలంక విక్టరీ

 14 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌పై టీ20 మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో  శ్రీలంక విక్టరీ

దంబుల్లా: బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌, బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో రాణించిన శ్రీలంక.. 14 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌పై టీ20 మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో విజయం సాధించింది. డాసున్‌‌‌‌‌‌‌‌ షనక (34), వానిందు హసరంగ (4/35) సత్తా చాటడంతో.. ఆదివారం రాత్రి ముగిసిన మూడో టీ20లో శ్రీలంక 14 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ను ఓడించింది. ఫలితంగా మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌ 1–1తో డ్రా చేసుకుంది. వర్షం వల్ల ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ను 12 ఓవర్లకు కుదించగా... టాస్‌‌‌‌‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు దిగిన లంక ఓవర్లన్నీ ఆడి 160/6 స్కోరు చేసింది. కమిల్‌‌‌‌‌‌‌‌ మిశ్రా (20), కుశాల్‌‌‌‌‌‌‌‌ మెండిస్‌‌‌‌‌‌‌‌ (30), ధనంజయ్‌‌‌‌‌‌‌‌ డిసిల్వా (22), చరిత్‌‌‌‌‌‌‌‌ అసలంక (21), జనిత్‌‌‌‌‌‌‌‌ లియాంగే (22 నాటౌట్‌‌‌‌‌‌‌‌) మెరుగ్గా ఆడారు. మహ్మద్‌‌‌‌‌‌‌‌ వాసిమ్‌‌‌‌‌‌‌‌ 3 వికెట్లు తీశాడు. తర్వాత ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో పాక్‌‌‌‌‌‌‌‌ 12 ఓవర్లలో 146/8 స్కోరుకే పరిమితమైంది. సల్మాన్‌‌‌‌‌‌‌‌ ఆగా (45) టాప్‌‌‌‌‌‌‌‌ స్కోరర్‌‌‌‌‌‌‌‌. మహ్మద్‌‌‌‌‌‌‌‌ నవాజ్‌‌‌‌‌‌‌‌ (28), ఖవాజ నఫీ (26) మినహా మిగతా వారు నిరాశపర్చారు. పతిరణ 2 వికెట్లు పడగొట్టాడు. హసరంగకు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌’, ‘సిరీస్‌‌‌‌‌‌‌‌’ అవార్డులు లభించాయి.