హత్రాస్ కేసు: బాధితురాలిది ముమ్మాటికీ హత్యాచారమే

హత్రాస్ కేసు: బాధితురాలిది ముమ్మాటికీ హత్యాచారమే

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చార్జిషీట్‌‌ ఫైల్ చేసింది. దళిత యువతిపై అత్యాచారం, హత్య కేసు విషయంలో ఎస్సీ, ఎస్టీ కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసుకు సంబంధించి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సందీప్, లవ్‌‌కుష్, రవి, రాము అనే నిందితులపై సీబీఐ చార్జి‌షీట్ నమోదు చేసింది. ఈ నలుగురే బాధితురాలిపై గ్యాంగ్ రేప్‌‌కు పాల్పడినట్లు, మర్డర్ చేసినట్లు చార్జిషీట్‌‌లో సీబీఐ పేర్కొంది. వీరిపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద.. సెక్షన్లు 354, 376 ఏ, 376 డీ, 302 ప్రకారం చార్జి‌షీట్ పెట్టింది. సెప్టెంబర్ 14న హత్రాస్‌‌లో ఈ ఘటన జరగగా.. అదే నెల 29న బాధితురాలు చనిపోయింది. యువతి అంత్యక్రియల విషయంలో త్వరగా నిర్వహించాలని తమను లోకల్ పోలీసులు బెదిరించారని ఆమె కుటుంబీకులు ఆరోపించారు.