75 దేశాల్లో లెఫ్ట్ సైడ్, 165 దేశాల్లో రైట్ సైడ్ డ్రైవర్ సీటు: నెపోలియన్ విధానమే మనమెందుకు ఫాలో అవుతున్నాం.. ?

75 దేశాల్లో లెఫ్ట్ సైడ్, 165 దేశాల్లో రైట్ సైడ్ డ్రైవర్ సీటు: నెపోలియన్ విధానమే మనమెందుకు ఫాలో అవుతున్నాం.. ?

రోడ్లపై నడిచేవాళ్లంతా ఎడమ వైపు నడవాలని అంటారు. వాహనాలు కుడివైపునకు వెళ్తాయి. అంతేకాదు.. వాహనాల్లోనూ డ్రైవర్ సీటు కుడివైపు ఉంటుంది.. అదే అమెరికాలో కుడివైపు నుంచే వెళ్లాలి. డ్రైవర్ సీటు ఎడమ వైపు ఉంటుంది. అమెరికాతో పాటు యూఏఈ, ఒమ‌న్, ఫ్రాన్స్‌, జర్మనీ, సౌదీ అరేబియా వంటి చాలా దేశాల్లో కారు, బస్సు, లారీలు వంటి వాహనాల డ్రైవింగ్ సీటు భారతదేశం తరహాలో కుడి వైపు ఉండదు. ఎడ‌మ‌ వైపు  డ్రైవింగ్ సీటు, స్టీరింగ్ ఉంటుంది. డ్రైవింగ్ సీటు విషయంలో ప్రపంచం రెండు విధానాలను ఎందుకు ఫాలో అవుతుంది అనేది తెలుసుకుందాం.

పూర్వ రోజుల్లో అందరూ ఎడమ వైపు మాత్రమే వెళ్లేవారు. దీనికి ఓ కారణం ఉంది.. అప్పట్లో ప్రజలంతా చాలా దూరం కాలినడకనే వెళ్లేవారు. వారంతా ఎడమవైపు వెళ్లేవారు. రాజుల కాలంలో భటులు గుర్రాలపై వెళ్లేవారు. గుర్రంపైనే యుద్ధాలు చేసేవాళ్లు.. అప్పట్లో గుర్రంపై వెళ్లేటప్పుడు క‌త్తిని కుడి చేత్తో సులభంగా తీసేందుకు వీలుగా కత్తి ఒర‌ను ఎడ‌మ వైపు ఉంచుకునేవాళ్లు.. ఎడ‌మ వైపు నుంచి కుడి కాలితో గుర్రం ఎక్కేందుకు అనువుగా ఉండేది. అందుకే సైనికులు తమ గుర్రాల‌తో ఎడ‌మ వైపు నుంచి వెళ్లేవారు. ఈ అలవాటు క్రమంగా ప్రజల్లోకి వచ్చింది. జనం గుర్రపు బండిపై ప్రయాణాలు చేయడం మొదలుపెట్టారు. అలా ప్రజలు కూడా సైనికుల్లానే ఎడ‌మ వైపు నుంచి వెళ్లేవారు. క్రీ.శ‌.1300లో రోమ్‌ను సంద‌ర్శించేందుకు వ‌చ్చే భక్తులంతా ఎడ‌మ వైపు నుంచే వాహ‌నాల‌ను న‌డ‌పాల‌ని పోప్ బెనిఫేస్ 8 నిబంధ‌న విధించాడ‌ని అప్పటి చరిత్రాకారులు చెబుతుంటారు.

క్రీ.శ‌.1700 నాటికి రవాణా వ్యవస్థ మెరుగుపడుతూ వచ్చింది. ఫ్రాన్స్‌లో ప్రయాణికులతో పాటు సరకు రవాణా చేసేందుకు గుర్రపు బండ్లు అందుబాటులోకి వచ్చాయి. సరుకు రవాణాకు గుర్రపు బండ్లనే ఉపయోగించేవాళ్లు. వాహనాల్లో మాదిరిగా గుర్రపు బండ్లను నడిపే వ్యక్తికి సరైన స్థలం ఉండేది కాదు. అప్పట్లో ఎడ‌మ వైపు నుంచి గుర్రంపై కూర్చొని కుడి చేత్తో కొర‌డా ప‌ట్టుకుని గుర్రపు బండిని నడిపించేవారు. బండి న‌డిపే వ్యక్తికి రోడ్డుకు పూర్తిగా ఎడ‌మ వైపు వెళ్లాలి. వెనక నుంచి వ‌చ్చే బండ్లను గమనించడం క‌ష్టంగా మారింది. వెనక బండ్లను గ‌మ‌నించేందుకు వీలుగా కుడివైపు నుంచి బండ్లను నడిపేవారు. అలా కుడి వైపు నుంచి గుర్రపు బండి నడిపే వ్యక్తికి రోడ్డు మధ్యలో నడుస్తుంటాడు. వెనుక నుంచి వ‌చ్చే బండ్లను గ‌మ‌నించ‌డానికి వీలుండేది. గుర్రాలను నడిపే వారు ఎడ‌మ వైపు నుంచి, గుర్రపు బండ్లు కుడి వైపు నుంచి వెళ్తుండటంతో గంద‌ర‌గోళానికి దారితీసింది. అప్పుడే 1792లో ఫ్రాన్స్ ప్రభుత్వం అందరూ కుడివైపు నుంచే వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాతే ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియ‌న్ చ‌ట్టంగా తీసుకొచ్చారు.

అప్పట్లోనే దేశాల మధ్య ఆధిపత్యం కోసం పోరాటాలు మొదలయ్యాయి. తమ ఉనికిని కాపాడుకునేందుకు అప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే 18వ శతాబ్దం నాటికి బ్రిట‌న్, ఫ్రాన్స్‌ శ‌క్తిమంత‌మైన దేశాలుగా మారాయి. అప్పటికే ఫ్రాన్స్‌లో అమ‌ల్లో ఉన్న కుడి వైపు డ్రైవింగ్ విధానాన్ని తమ దేశాల్లోనూ అమ‌ల్లోకి తెచ్చాయి. బ్రిట‌న్ ఈ కుడి వైపు డ్రైవింగ్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. బ్రిట‌న్.. తమ దేశంతో పాటు తమ ఆధీనంలో ఉన్న భార‌త్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, ద‌క్షిణాఫ్రికా స‌హా చాలా దేశాల్లో ఎడ‌మ వైపు డ్రైవింగ్‌నే కొన‌సాగించాయి.

ఎడ‌మ వైపు డ్రైవింగ్‌ను పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకొచ్చేందుకు జ‌న‌ర‌ల్ హైవే పేరుతో ఒక చ‌ట్టాన్ని తీసుకొచ్చింది. ఇండోనేసియా, థాయిలాండ్, జ‌పాన్‌ వంటి ఆసియా దేశాలు సైతం ఈ ఎడ‌మ‌వైపు డ్రైవింగ్‌నే ఫాలో అయ్యాయి. వాహనాల్లో డ్రైవింగ్ ఈజీగా ఉండేందుకు వీలుగా డ్రైవ‌ర్ సీటును కుడి వైపునకు మార్చేశాయి. అమెరికా, కెన‌డాలో ఒకప్పుడు ఎడ‌మ వైపు డ్రైవింగ్ ఉండేది. కానీ, ఆ తర్వాత ఫ్రాన్స్ కుడి వైపు డ్రైవింగ్‌కు మార్చేసింది. ప్రస్తుతం గ‌ణాంకాల ప్రకారం.. 75 దేశాల్లో ఎడ‌మ వైపు డ్రైవర్ సీటు ఉంటే.. 165 దేశాల్లో కుడి వైపు డ్రైవింగ్ చేస్తున్నారట.