లతా మంగేష్కర్ కోసం అయోధ్యలో హోమం

లతా మంగేష్కర్ కోసం అయోధ్యలో హోమం

ప్రముఖ గాయిని లతా మంగేష్కర్ అనారోగ్యం బారిన పడిన విషయం తెలిసిందే. కోవిడ్ బారిన పడిన ఆమె... ఆరోగ్యం క్షీణించి ముంబై బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేరారు. అక్కడ ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. లతా ఆరోగ్యం కోసం పలువురు పూజలు చేస్తున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలంటూ.. అయోధ్యలో స్వామిజీలు హోమం నిర్వహించారు. లతా ఆరోగ్యవంతంగా తిరిగి రావాలంటూ.. మహా మృత్యుంజయ జపం నిర్వహించామని స్వాములు తెలిపారు. ప్రధాని మోదీ వెళ్లి ఆమెను పరామర్శించాలని ఈ సందర్బంగా వారు కోరారు.

ప్రస్తుతం లతా ఆరోగ్యం బాగానే ఉందని ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. ఆమె వయసు రీత్యా ఐసీయూలో ఉంచి ఆమెకు ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. లతా మంగేష్కర్ ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి ఆమె త్వరగా కోలుకోవాలని ప్రముఖులు, అభిమానులు ప్రార్థిస్తున్నారు.