HCA అధ్యక్షుడి నియామకం చెల్లదు.. బాధ్యతల నుంచి అమర్నాథ్ తప్పుకోవాలి: హైకోర్టు

HCA అధ్యక్షుడి నియామకం చెల్లదు.. బాధ్యతల నుంచి అమర్నాథ్ తప్పుకోవాలి: హైకోర్టు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ( HCA) ప్రస్తుత అధ్యక్షుడి నియామకం చెల్లదని హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.  అంబుడ్స్మన్ ఆర్డర్తో ప్రెసిడెంట్ గా నియమితుడైన అమరనాథ్.. బాధ్యతల నుంచి వైదొలగాలని ఆదేశించింది. హెచ్సీఏ అధ్యక్షుడి నియామకంపై దాఖలైన పిటీషన్  2026 జూన్ 08న విచారించిన కోర్టు.. ఈ మేరకు తీర్పును వెలువరించింది.

ప్రస్తుత అధ్యక్షుడిని పదవి నుంచి వైదొలగాలని చెప్పిన న్యాయస్థానం.. కొత్త అధ్యక్షుని ఎన్నికకు మార్గదర్శకాలను సూచించింది. స్పెషల్ ఏజీఎం నిర్వహించి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని హెచ్ సి ఏ  సెక్రెటరీ జీవన్ రెడ్డిని ఆదేశించింది.

2023లో జరిగిన హెచ్‌సీఏ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, ఫోర్జరీ పత్రాలతో జగన్ మోహన్ రావు పోటీ చేశారనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.  గెలాక్సీ క్రికెట్ క్లబ్‌కు చెందిన  అమర్‌నాథ్ ఫిర్యాదతో అంబుడ్స్‌మన్ జస్టిస్ సురేష్ కుమార్ కైత్ జగన్ మోహన్ రావు ఎన్నిక చెల్లదని తీర్పు వెలువరించారు. జగన్ మోహన్ రావు స్థానంలో అమర్ నాథ్ ను హెచ్ సీఏ అధ్యక్షుడిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. సంస్థ కార్యకలాపాలు ఆగిపోకూడదనే ఉద్దేశంతో, రన్నరప్‌గా నిలిచి 62 ఓట్లు సాధించిన అమర్‌నాథ్‌ను అధ్యక్షుడిగా ప్రకటించారు. 

ALSO READ : డెబ్యూ మ్యాచ్‌లోనే మానవ్ సుతార్ మైండ్ బ్లాక్ రికార్డ్

 అయితే, తన తొలగింపును సవాలు చేస్తూ జగన్ మోహన్ రావు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు అంబుడ్స్ మన్ ఆర్డర్ తో హెచ్ సీఏ ప్రెసిడెంట్ అయిన అనర్ నాథ్ నియామకం చెల్లదని తీర్పు వెలువరించింది.