
గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ హెచ్‌సీఎల్‌టెక్‌కు టైమ్ మ్యాగజైన్ రెండు గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో స్థానం కల్పించింది. 'వరల్డ్స్ బెస్ట్ కంపెనీస్ 2025', 'వరల్డ్స్ మోస్ట్ సస్టయినబుల్ కంపెనీస్ 2025' ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకుంది. 'వరల్డ్స్ బెస్ట్ కంపెనీస్ 2025'లో వరుసగా రెండో ఏడాది కూడా చేరింది. ప్రొఫెషనల్ సర్వీసెస్‌లో గ్లోబల్ టాప్–20 కంపెనీల్లో స్థానం దక్కించుకుంది. 'వరల్డ్స్ మోస్ట్ సస్టైనబుల్ కంపెనీస్ 2025'లో ప్రొఫెషనల్ సర్వీసెస్‌లో టాప్-15లో నిలిచింది.
200ఎంపీ కెమెరాతో వివో వీ60ఈ
వివో వీ60ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. 200ఎంపీ అల్ట్రా-క్లియర్ మెయిన్ కెమెరా, ఏఐ ఫెస్టివల్, పోర్ట్రెయిట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీనిలోని 6500ఎంఏహెచ్ బ్యాటరీకి 90 వాట్ల ఫ్లాష్‌చార్జింగ్ సదుపాయం ఇచ్చారు. వీ60ఈలో ఏఐ ఇమేజ్ ఎక్స్‌పాండర్ వంటి స్మార్ట్ ఏఐ ఫీచర్లు ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో ప్రొసెసర్‌తో పనిచేస్తుంది. ధర ధర రూ. 29,999 నుంచి ప్రారంభమవుతుంది.
పీజీఐ సిగ్నేచర్ ఎడిషన్ నగలు
పండుగ సీజన్ సందర్భంగా, ప్లాటినం గిల్డ్ ఇంటర్నేషనల్ (పీజీఐ) ఇండియా 'మెన్ ఆఫ్ ప్లాటినం ఎంఎస్ ధోని సిగ్నేచర్ ఎడిషన్'ను తిరిగి తీసుకువచ్చింది. ఈ నగలను 95శాతం స్వచ్ఛమైన ప్లాటినంతో తయారు చేశారు. కొత్త కలెక్షన్‌లో స్కల్ప్చరల్ లింక్ బ్రాస్‌లెట్‌లు, డ్యూయల్-టోన్ పీస్‌లు ఉన్నాయి. వీటిని కొన్న వాళ్లు 2026 ప్రారంభంలో ముంబైలో జరగనున్న కార్యక్రమంలో ఎంఎస్ ధోనిని కలుసుకునే అవకాశం ఉంటుంది.
మ్యాక్స్క్లీన్ 2-ఇన్-1 ఫ్లోర్ క్లీనర్
విప్రో కన్స్యూమర్ కేర్ మ్యాక్స్క్లీన్, 2-ఇన్-1 ఫ్లోర్ క్లీనర్‌ను విడుదల చేసింది. ఇది క్రిములనూ, కీటకాలనూ తరిమి కొడుతుంది. చీమలు, ఈగలను దూరం చేస్తుంది. మ్యాక్స్క్లీన్ 99.9శాతం క్రిముల నుంచి రక్షణ అందిస్తుంది. దీనిని లెమన్‌గ్రాస్, సెడార్‌వుడ్, పైన్ ఆయిల్ వంటి సహజసిద్ధ పదార్థాలతో తయారు చేశామని విప్రో తెలిపింది. ఈ ఫ్లోర్‌క్లీనర్ ప్రచారం కోసం ప్రత్యేక టీవీసీని రూపొందించామని తెలిపింది.