చెప్పిన మాట వినడం లేదని తమ్మునిపై అన్న కత్తితో దాడి

చెప్పిన మాట వినడం లేదని తమ్మునిపై అన్న కత్తితో దాడి

నర్సంపేట, వెలుగు : మాట వినడం లేదని సొంత తమ్ముడిపై అన్న కత్తితో దాడి చేసిన ఘటన వరంగల్​ జిల్లా నర్సంపేటలో మంగళవారం జరిగింది. రాంనగర్​ ఎస్సీ కాలనీకి చెందిన దొడ్డ దేవేందర్​(22), అమరేందర్ (18)​ ఇద్దరు అన్నదమ్ములు. కొన్ని నెలల క్రితం వీరి తల్లిదండ్రులు అనారోగ్యంతో చనిపోయారు. అన్న దమ్ములిద్దరూ తమ ఇంట్లోనే కలిసి ఉంటూ.. కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు.

తన మాట వినడం లేదని అమరేందర్​పై దేవేందర్​ కత్తితో దాడి చేశాడు. అమరేందర్​ పొట్టలోకి కత్తి దూసుకపోయి తీవ్ర రక్త స్రావం అయింది. వెంటనే నర్సంపేట జిల్లా హాస్పిటల్​కు తరలించారు. పరిస్థితి విషమించడంతో అమరేందర్​ను వరంగల్​ ఎంజీఎంకు తరలించారు. పోలీసులు స్పాట్​కు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.