అభివృద్ధి కోసమే రాజీనామా అనడం చేతగానితనమే

అభివృద్ధి కోసమే రాజీనామా అనడం చేతగానితనమే

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి ఇక అసెంబ్లీ లో అడుగు పెట్టడం కష్టమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ మునిగిపోయే పడవ అన్న జీవన్ రెడ్డి... ఒకవేళ గెలిస్తే ఇమేజ్ పెరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ గెలిస్తే గవర్నమెంట్ ఫాం చేస్తామని జీవన్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. అభివృద్ధి కోసమే రాజీనామా చేశానని రాజగోపాల్ అనడంపై జీవన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. అలా అనడం రాజగోపాల్ రెడ్డి చేతగానితనానికి నిదర్శమన్నారు. పోరాడే అవకాశం ఇచ్చినా.. రాజగోపాల్ రెడ్డి ఉపయోగించుకోలేదని మండిపడ్డారు. తన మూడేళ్ల పదవీ కాలంలో ప్రజల కోసం రాజగోపాల్ ఏం చేశారో చెప్పాన్నారు. రాజగోపాల్ రెడ్డి ఫైట్ చేస్తానంటే కాంగ్రెస్ ఏమైనా అడ్డుపడ్డదా అని ప్రశ్నించారు. హుజురాబాద్ కు మునుగోడు కు సంబంధమే లేదన్న జీవన్ రెడ్డి... నీ పోరాటానికి పీసీసీ పదవే అడ్డం వచ్చిందా అని రాజగోపాల్ రెడ్డిని నిలదీశారు. అందరూ అలాగే అనుకుంటే ఎవ్వరు కాంగ్రెస్ లో ఉండరని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.

ఇక రాజగోపాల్ రెడ్డి రాజీనామా అంశం కొన్ని రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఇవాళ తన ఎమ్మెల్యే పదవికి  రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్ లో రిజైన్ లెటర్ ఇచ్చారు. వెంటనే స్పీకర్ ఆమోదం తెలిపారు. ఇక రాజీనామా చేసేముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు.