పిల్లలు వద్దని చిత్రహింసలు.. అబార్షన్ మాత్రలు ఇచ్చేవారు.. హీరో భార్య షాకింగ్ ఆరోపణలు

పిల్లలు వద్దని చిత్రహింసలు..  అబార్షన్ మాత్రలు ఇచ్చేవారు..  హీరో భార్య షాకింగ్ ఆరోపణలు

భోజ్‌పురి చిత్ర పరిశ్రమలో 'పవర్ స్టార్'గా పేరుగాంచిన పవన్ సింగ్ , ఆయన భార్య జ్యోతి సింగ్ విడాకుల వివాదం రోజుకో మలుపు తీసుకుంటోంది. కోర్టులో కేసు నడుస్తుండగానే లేటెస్ట్‌గా జ్యోతి సింగ్ మీడియా ముందుకొచ్చి మరో సారి  సంచలన ఆరోపణలు చేసింది. పవన్ సింగ్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధంగా ఈ తరుణంలో ఆమె ఆరోపణలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  ఇప్పుడు ఆమె చేసిన  వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా  మారాయి.

పిల్లల కోసం ఆరాటమంటే ఇదేనా?

పవన్ సింగ్ వైఖరిపై తీవ్రంగా మండిపడిన జ్యోతి, పిల్లల కోసం తను ఆరాటపడుతున్నానని పవన్ పదే పదే చెబుతున్నారు. కానీ, నిజంగా పిల్లల్ని కోరుకునే వ్యక్తి తన భార్యకు ప్రతిసారీ అబార్షన్ మాత్రలు ఎందుకు ఇస్తారు? ఈ విషయాలు ఇంతవరకు మీడియాకు చెప్పకూడదనుకున్నా.  కానీ నా వైపు వాస్తవాలను బయటపెట్టేలా పవన్ ప్రవర్తిస్తున్నారు. నేను ఆయన్ని అపఖ్యాతి పాలు చేయడం లేదు, నా బాధను మాత్రమే బయటపెడుతున్నాను అని కన్నీటి పర్యంతమయ్యారు.

 గర్భస్రావ మాత్రలు ఎందుకు ఇస్తున్నావని ప్రశ్నించినందుకు పవన్ తనన చిత్రహింసలకు గురిచేసేవారని జ్యోతి ఆరోపించింది. ఆ బాధ తట్టుకోలేక, తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఏకంగా 25 నిద్ర మాత్రలు వేసుకుని ఆత్మహత్యాయత్నం చేశానని ఆమె వెల్లడించారు. ఆ సమయంలో పవన్ సోదరుడు రాణు భయ్యా , టీమ్ సభ్యులు తనను వెంటనే ముంబైలోని అంధేరిలో ఉన్న బెల్లెవ్యూ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్కు తీసుకెళ్లి చికిత్స అందించారని తెలిపారు.

 

పవన్ సింగ్ భావోద్వేగ స్పందన

అయితే జ్యోతి చేసిన ఆరోపణలన్నింటినీ పవన్ సింగ్ పూర్తిగా ఖండించారు. నేను కూడా మనిషినే, నాకు కూడా ఆమెతో భరించలేకపోతున్నా.. మహిళలకు ఏ చిన్న విషయం అయినా కళ్లలో నీళ్లు వచ్చేస్తాయి. అది అందరికీ కనిపిస్తుంది. కానీ, పురుషుడి బాధ ఎవరికీ కనిపించదు.  అతను తన నొప్పిని చూపించలేడు, మనసులో బాధను కూడా చెప్పుకోలేడు అంటూ పవన్ సింగ్ భావోద్వేగం వ్యక్తం చేశారు.. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరట్ అవుతున్నాయి.

 

రెండో భార్యతోనూ వివాదం

పవన్ సింగ్, జ్యోతి సింగ్‌ను 2018లో వివాహం చేసుకున్నారు. అయితే, వీరిద్దరూ ప్రస్తుతం విడిగా ఉంటున్నారు. విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది. దీనికి ముందు, పవన్ సింగ్ తన మొదటి భార్య నీలా దేవికి విడాకులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో, రెండో భార్య జ్యోతి సింగ్ చేసిన ఆరోపణలు, పవన్ వ్యక్తిగత జీవితంపై తీవ్ర విమర్శలకు దారి తీశాయి. బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఈ హీరో వివాదం మరింత చర్చనీయాంశంగా మారింది.  కోర్టు తుది తీర్పు కోసం భోజ్‌పురి అభిమానులు ,సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.