టీఆర్ఎస్ పట్టించుకోవట్లే.. నిర్ణయం తీసుకుంటా

టీఆర్ఎస్ పట్టించుకోవట్లే.. నిర్ణయం తీసుకుంటా

వనపర్తి/వీపనగండ్ల, వెలుగు: ‘ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచా.. రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేశా..ఎంతో రాజకీయ అనుభవం ఉంది. మంత్రి పదవికి రాజీ నామా చేసి టీఆర్ఎస్ లో చేరా. ఓటమితో బాధ పడుతున్న నన్ను టీఆర్ఎస్ మరింత బాధపెడుతోంది’ అంటూ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవేదన వ్యక్తంచేశారు. గురువారం వనపర్తి జిల్లా వీపనగండ్లలో ఆయన తన మద్దతుదారులతో సమావేశం నిర్వహించారు. కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అధికార బలంతో తనను ఇబ్బందులకు గురిచేస్తున్నాడన్నారు. టీఆర్ఎస్ ​పార్టీ తనను గుర్తించడం లేదన్నారు. ఈసారి అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు వస్తాయని అభిప్రాయపడ్డారు‌‌. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని, కార్యకర్తలు తనపై ఇదే అభిమానం చూపాలని కోరారు. త్వరలో నియోజకవర్గంలోని ప్రతి గడప తడతానని, ప్రజా సమస్యలపై గళమెత్తుతానని చెప్పారు.