నా కొడుకును మళ్లీ చూస్తాననుకోలేదు

నా కొడుకును మళ్లీ చూస్తాననుకోలేదు

ఉక్రెయిన్ లో యుద్ధం రాగానే.. మన దేశంలో వేల మంది తల్లడిల్లిపోయారు. ఆ దేశంలో చదువుకుంటున్న ఇండియన్ స్టూడెంట్స్.. తిరిగి స్వదేశానికి క్షేమంగా చేరుకుంటారో లేదోనని వారి తల్లిదండ్రులు బెంగపెట్టుకున్నారు. యుద్ధ కల్లోలం నుంచి బయటపడి.. రాగలుగుతాడో లేదోనన్న ఆందోళనతో బతుకుతున్నారు. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగ’ పేరుతో మన పౌరులను స్వదేశానికి తరలించేందుకు రంగంలోకి దిగింది. ఇప్పటికే దాదాపు 17 వేల మందికి పైగా భారత్ కు చేర్చింది. తాజాగా ఉక్రెయిన్ లోని సుమీ నుంచి మూడు స్పెషల్ ఫ్లైట్ లో ఇండియన్ స్టూడెంట్స్ ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సమయంలో ప్రాణాలతో స్వదేశానికి వస్తారో లేదో అనుకున్న తమ బిడ్డలను చూసి భావోద్వేగానికి లోనవుతున్నారు. తమ పిల్లలను క్షేమంగా ఇండియాకు తీసుకొచ్చిన ప్రధాని మోడీకి ఆనంద భాష్పాలతో కృతజ్ఞతలు చెప్పుకొంటున్నారు. పులమాలలు వేసి పిల్లలకు స్వాగతం చెప్పి వాళ్లను గుండెలకు హత్తుకుంటున్నారు. ఢిల్లీకి చేరుకున్న ఫ్లైట్ లో దిగిన తన కొడుకును చూసి కశ్మీర్ కు చెందిన ధ్రువ్ అనే విద్యార్థి తండ్రి సంజయ్ పండిత ఎమోషనల్ అయిపోయారు.

‘‘నా కొడుకు ధ్రువ్ ఉక్రెయిన్ నుంచి తిరిగి క్షేమంగా వస్తాడనుకోలేదు. సుమీలో యుద్ధ పరిస్థితుల దృష్ట్యా వాడిపై ఆశలు వదులకున్నాం. వీడిని ప్రాణాలతో తీసుకొచ్చింది.. ప్రధాని మోడీనే.. ఇక వీడు మోడీ బిడ్డనే. ఆశలు వదిలేసుకున్న మా బిడ్డను క్షేమంగా తీసుకొచ్చినందుకు భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు. భారత్.. జిందాబాద్’’ అంటూ సంజయ్ పండిత కంటతడి పెట్టుకున్నాడు. ఈ రోజు తన బిడ్డ వస్తున్నాడని తెలిసి, ఏం తీసుకురావాలని అడిగితే.. ఏం వద్దు తాగడానికి మంచినీళ్లు చాలు అని చెప్పాడని, అంతటి దుర్భర స్థితి నుంచి క్షేమంగా రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.

బతికి బయటపడుతామనుకోలేదు

సుమీలో చాలా భయంకరమైన పరిస్థితుల మధ్య చిక్కుకున్నామని ధ్రువ్ అన్నాడు. అక్కడి నుంచి బతికి బయటపడుతామని అనుకోలేదన్నాడు. క్షేమంగా ఇండియాకు చేర్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటామని అన్నారు. భారత్ మాతా కీ జై అంటూ నినదించాడు.

మూడు ఫ్లైట్స్.. 674 మంది

ఉక్రెయిన్ లోని సుమీలో చిక్కుకున్న 674 మందిని మూడు స్పెషల్ ఫ్లైట్స్ లో స్వదేశానికి చేర్చింది కేంద్ర ప్రభుత్వం. ఎయిరిండియా, ఇండిగో విమానాల్లో 461 మంది.. ఎయిర్ ఫోర్స్ ట్రాన్స్ పోర్ట్ విమానంలో సీ17లో 213 మంది ఇండియా చేరుకున్నారు.

మరిన్ని వార్తల కోసం..

తెలంగాణ పాటకు పట్టం కట్టిన రచయిత కందికొండ కన్నుమూత

రేపటి నుంచి తిరుమలలో శ్రీవారి తెప్పోత్సవాలు

ప్రాణాలతో ఉండాలంటే.. మీ పిల్లల్ని యుద్ధానికి పంపకండి