కెనడా వెళ్తున్నానని చెప్పి.. ఫోన్ స్విచాఫ్

కెనడా వెళ్తున్నానని చెప్పి.. ఫోన్ స్విచాఫ్
  • మాదాపూర్​లో యువకుడి మిస్సింగ్

మాదాపూర్​, వెలుగు :  యువకుడి మిస్సింగ్ ఘటన మాదాపూర్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్​లోని​ ఇజ్జత్​నగర్‌‌‌‌కు చెందిన ఉడుత ఎల్లయ్య లేబర్​గా పనిచేస్తున్నాడు. అతడి కొడుకు మహేష్​(20) బీటెక్​ పూర్తి చేశాడు. కొడుకు ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్తానని చెప్పగా.. ఎల్లయ్య  గతేడాది అక్టోబర్​22న రూ.2 లక్షలు ఇచ్చాడు. 

ఆ తర్వాత నుంచి మహేశ్ సెల్ ఫోన్ స్విచాఫ్​వస్తుండటంతో ఎల్లయ్య ఇంట్లో కొడుకు వస్తువులను చెక్ చేశాడు. మహేశ్​ పాస్​​పోర్టు ఇంట్లోనే ఉండటంతో అనుమానంతో సోమవారం మాదాపూర్ పీఎస్​లో కంప్లయింట్ చేశాడు. మిస్సింగ్ కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.