124 గజాల ఇంటిని 4 ఫీట్లుపైకి లేపారు

124 గజాల ఇంటిని 4 ఫీట్లుపైకి లేపారు

వానాకాలం వచ్చిందంటే ఎటు నుంచి వరద ముంచెత్తుతుందో తెలియక లోతట్టు ప్రాంతాల్లోని జనం వణికిపోతున్నారు. ఒకప్పుడు హైదరాబాద్ ​లాంటి పెద్ద నగరాలకే పరిమితమైన వరదలు, ఇప్పుడు వరంగల్​, కరీంనగర్​, నిజామాబాద్ ​లాంటి సిటీల్లోనూ కామన్​ గా మరాయి. అధికారులు, ప్రజాప్రతినిధుల తీరుతో ప్లానింగ్​ లేకుండా వెలుస్తున్న కాలనీలు రోజుల తరబడి నీటిలో మునిగి ఉంటున్నాయి. ఇండ్ల చుట్టూ చేరే బురద, మురుగుతో ఓ వైపు రోగాలు, మరోవైపు పురుగుపుట్రతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియట్లేదు. ఆయా చోట్ల వరద నివారణ చర్యలు చేపట్టని ప్రభుత్వంపై నమ్మకం కోల్పోతున్న కొందరు ఇంటి ఓనర్లు తామే స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. నిజామాబాద్ ​లోని 16 డివిజన్​కు చెందిన సత్యనారాయణ, లావణ్య దంపతులు ఓ అడుగు ముందుకేసి తమ 124 గజాల ఇంటిని నాలుగు ఫీట్ల పైకి లేపారు. ఇంటర్ నెట్​లో ఓ వీడియో చూసి హర్యానా నుంచి పనివాళ్లను పిలిపించామని చెప్పారు. ఇంటిని పైకి లేపేందుకు రూ.5 లక్షలు ఖర్చయిందని, 15 రోజుల టైం పట్టిందని సత్యనారాయణ తెలిపారు. ఇప్పుడు వరద వచ్చినా ఎలాంటి భయం ఉండదని, ఇది తమకు ఎంతో రిలీఫ్​ అని చెప్పారు. 

– వెలుగు ఫొటోగ్రాఫర్​, నిజామాబాద్